#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


సామంటున్నది గీత. మూడు లక్షణాలలో ఆపాటికే శిక్షణ పొంది ఉండాలి వాడు. కామక్రోధాలు రెండూ జయించి ఉండాలి. అది ఒకటి. నిత్యమూ యతనం లేదా ప్రయత్నం సాగిస్తూ ఉండాలి జ్ఞానార్జనకు. రెండు అంతేకాదు యతచేతసా మంటున్నాడు. మనసెప్పుడూ తదాకారంతోనే నిండిపోవాలి మూడు - అప్పుడే అది పరిపాకానికి వస్తుంది. వస్తే ఇక తొలగిపోయే భయమే లేదు. ప్రారబ్ధం కొద్దీ తొలగినట్టు కనిపించినా ప్రత్యనుసంధాన బలంతో ఎప్పటికప్పుడు ప్రత్యక్ష మవుతూనే ఉంటుంది.

  ఇక్కడ రెండు సూక్ష్మాలున్నాయి మనం బాగా లోతుకు దిగి తేల్చుకో వలసినవి. ఒకటి కామక్రోధాలనే మాట. రెండవది బ్రహ్మమూ ఆత్మా అనే మాట. మొదట కామక్రోధాల విషయ మాలోచిద్దాం. కామక్రోధాలంటే ఏవోగావు. రాగద్వేషాలకే మారుపేరని చెప్పాము. ఇచ్ఛా ద్వేషాలన్నా అవే. ఈ జంట పదాలు మూడూ పదే పదే వినిపిస్తుంటాయి మనకు భగ వద్గీతలో ఇంతకుముందూ వచ్చాయివి. ఇప్పుడూ వస్తున్నాయి. ఇక మీదటా వస్తాయి. ఎందుకు వీటి కింత ప్రాధాన్య మిస్తున్నది గీత. ఇవి రెండూ ఉన్నంత వరకూ అసలు నీవు సాధనే చేయలేవని శాపం పెడుతున్నది.

  ఏమి టిందులో ఉన్న రహస్యం. సంసారమే మానవుడికున్న ఏకైక సమస్య. అది ద్వంద్వాత్మకం. ద్వంద్వాలంటే ఒకటి అనుకూలం. ఒకటి ప్రతికూలం Opposites. సుఖదుఃఖాలూ జయాపజయాలూ. లాభనష్టాలూ పుణ్యపాపాలూ. చివరకు జనన మరణాలూ - ఇహపరాలూ - పూర్వోత్తర జన్మలూ - ఇవన్నీ ద్వంద్వాలే. కాని చిత్రమేమంటే ఇన్ని విధాలుగా కనిపిస్తున్నా ఇవి పరిగణించటానికే పనికి వస్తాయి గాని లోతుకు దిగి

Page 437

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు