#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


విమర్శిస్తే ఇన్ని లేవు ద్వంద్వాలు. వాస్తవంలో ఇవన్నీ కలిసి రాగద్వేషాలనే ద్వంద్వంలోనే చేరిపోతాయి. ఎలాగని అడుగుతారేమో. సుఖదుఃఖాలలో సుఖం మీద రాగం మనకు. దుఃఖం మీద ద్వేషం. అలాగే లాభమంటే రాగం. నష్టమంటే ద్వేషం. జయం మీద రాగం. అపజయం మీద ద్వేషం. ఏ ద్వంద్వమైనా చూడు నీవు. ఒకటి అనుకూలమైతే ఒకటి ప్రతికూలం. అందులో అనుకూలం మీద రాగం మనకు ప్రతికూలం మీద ద్వేషం. అవునా కాదా. కాబట్టి ప్రపంచమంతా ద్వంద్వాత్మకమైతే అది అనుకూల ప్రతికూలాలైతే అది మరలా ఏదో గాదు రాగద్వేషాలే. లేదా కామక్రోధాలే. అంటే ఏమన్నమాట. ప్రపంచమంతా కామక్రోధాత్మకమే చివరకు.

  కాబట్టి అనాత్మ ప్రపంచ సమస్య పరిష్కారం కావాలంటే ఈ కామక్రోధాలకు జవాబు చెప్పట మొక్కటే మార్గం. అవి మనలను వెంటాడుతున్న వరకూ సమస్య తప్పదు. అందుకే ఇచ్ఛాద్వేష సముత్తైన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్దేయాంతి పరంతప అని ఘంటాపధంగా చాటుతున్నది భగవద్గీత. ఇచ్ఛాద్వేషాలనే ద్వంద్వ మొక్కటే అసలు మనకున్న ద్వంద్వం. మరేద్వం ద్వమూ లేదు. దానివల్ల ఏర్పడిందే మోహం లేదా అజ్ఞానం. అది సర్వ మానవులకూ జన్మతోనే సంప్రాప్త మయిందట. అంచేత రాగద్వేషాలనే ద్వంద్వం మనలను వెంటాడుతుంటే దాన్ని సాధకుడైన వాడు వేటాడి నిర్మూలించవలసి ఉంది. లేకుంటే సంసారమే తప్ప సాయుజ్యానికి నోచుకోలేడు. అందుకే గీత

Page 438

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు