
అసలు కర్మ కర్మ అంటున్నావు. నీవు కర్త్యత్వమనేది పెట్టుకొంటే గాని కర్మ అనేది చేయలేవు. చేస్తేగాని ఏర్పడదు కర్మ. కర్మ ఏర్పడితే గాని కర్మ ఫలమనేది తయారు గాదు. కర్మ ఫలం తయారయితే గాని దానితో నీకు సంబంధ మేర్పడదు. కర్మఫల మను భవిస్తున్నావంటే అంతకు ముందే ఆ ఫలమేర్పడి ఉండాలి. ఫల మేర్పడాలంటే కర్మ అనేది నీవు చేసి ఉండాలి. కర్మనీవు చేయాలంటే నేను కర్తనని కర్తృత్వమనే భావం నీవు నీమీద పెట్టుకొని ఉండాలి. నీవు కర్తవే గాకపోతే కర్మ ఎలాచేస్తావు. కర్మ చేసుకోకపోతే ఫలిత మెక్కడిది. ఫలమే లేకుంటే నీ కనుభవమెలా కలుగుతుంది.
అదే చెబుతున్న దిప్పుడు గీత. న కర్తృత్వం నకర్మాణి న కర్మ ఫలసంయోగం - లోక స్య సృజతి ప్రభుః- నీకసలు కర్తృత్వమూ లేదు. కర్మలూ లేవు - కర్మ ఫలమైన సుఖదుఃఖాలతో జననమరణాలతో లోకాంతర జన్మాంతరాలతో దేనితో కూడా సంబంధమే లేదు. ఎవరైనా సృష్టిస్తే గదా ఇవన్నీ ఏర్పడేది. లోకస్య నసృజతి ప్రభుః - లోకులకివి తయారుచేసి వాడి నెత్తిన పడేయలే దెవరూ. పడేయాలంటే అంతకు ముందెవ రుండాలి. ప్రభుః ఆత్మ చైతన్యం. ఆత్మ అంటే అది శుద్ధ చైతన్యం Pure consciouness -నిరాకారమూ నిశ్చలమైనది చైతన్యం. నిరాకారం గనుక సర్వవ్యాపకం. అది తప్ప మరొక అనాత్మ పదార్ధమంటూ లేదు. ఏకమేవా ద్వితీయం. మరి జీవజగత్తు లేమిటి. ఎక్కడినుంచి వచ్చాయివి.
ఆత్మే సృష్టించిందంటావా. ఆత్మ ప్రభువే. ప్రభవతీతి ప్రభుః దేనికైనా సామర్ధ్య మున్నదేదో అది ప్రభుః- సృష్టించినా సృష్టించవచ్చు. కాని
Page 407
బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు