#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత


  సృష్టించదు. కారణం తనకు భిన్నంగా ఏదీ చూడలేదది. చూడకున్నా సృష్టించే సామర్ధ్యముంది గదా అని అడగవచ్చు. భిన్నంగా ఏదీ లేదు. అయినా సామర్ధ్యముంది గనుక సృష్టిస్తుందంటే అది వాస్తవమైన సృష్టి గాదు. సృష్టి గాని సృష్టి. దాని దృష్టే దాని సృష్టి. దృష్టి వేరు తాను వేరూ కాదా ఆత్మ. దృష్టి తానే తన స్వభావమే. ఆ స్వభావమే తన పాటికి తానుంటూనే మరొక పదార్ధంలో కూడా భాసించగలదు. ఆ మరొకటి వస్తువు గాదు. ఆ భాస. వస్తువే రూపాంతరం ధరించి కనిపిస్తే ఆ భాస. అద్దంలో మన నీడ కనిపిస్తుం దనుకొండి. అది వాస్తవమా. వాస్తవంగా ఉన్నది నాముఖమే. అదే ప్రతి ముఖంగా భాసిస్తున్నది. అలాగే ఆత్మే అనాత్మగా భాసిస్తున్నది నీకూ నాకూ.

  అదే జీవుడూ వీడి కర్తృత్వమూ. వీడు చేసే కర్మలూ - వాటి కేర్పడే సుఖదుఃఖాది ఫలమూ - లోకాంతర జన్మాంతరాలూ అంతా ఒక పెద్ద ఆభాస. నాటకం. వాస్తవం కాదు. వాస్తవం కాకున్నా ఎలా ఏర్పడిం దంటారా. అది ఆ వస్తు స్వభావ మని జవాబు. అదే జవా బిస్తున్నాడు మహర్షి స్వభావస్తు ప్రవర్తతే. ఆత్మ తాలూకు స్వభావమే అలా అనాత్మ ప్రపంచంగా భాసిస్తున్నది. అంతేగాని ఆత్మ తానుగా ఏదీ కాలేదు. చేయలేదది. అయినా మనమెందు కిలాంటి భావాలు నెత్తినపెట్టుకొని నేను కర్తనూ భోక్తనని తాపత్రయ పడుతున్నామని అడుగవచ్చు. అదీ ఆత్మ స్వభావమే నంటాడు మహర్షి. ఇందులో ఏ ఆత్మ స్వభావమేది. పరమాత్మ స్వభావమా జీవాత్మస్వభావమా. ఇది నాస్వభావ మదే ఇన్ని రూపాలలో భాసిస్తున్నదనే జ్ఞానంతో చూడగలిగితే అది పరమాత్మ. అలాంటిజ్ఞానం లేక ఇదంతా నాకు భిన్నంగా ఏదో ఉండి నాకిలా కనిపిస్తూ- నన్ను కష్ట

Page 407

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు