కర్మసన్యాస యోగము
భగవద్గీత
పురంలో. నవద్వారా లేమిటి. రెండు కళ్లూ రెండు చెవులూ రెండు ముక్కు పుటాలూ- ఒక నోరూ -ఇవి ఏడు. పోతే మూత్ర పురీషద్వారాలు రెండూ. వెరసి తొమ్మిది.
అయితే కూచోటం వరకేనా పురంలో. ఏమైనా పనిపెట్టు కొంటూ కూడా ఉంటాడా. ఏపనీ పెట్టుకోడు. చేయడు. నైవకుర్వన్నకారయన్ అంటున్నది గీత. ఒక పని తానుగా చేయడట. దేహేంద్రియాదుల చేత చేయించడట నైవ కుర్వన్న కారయన్. మరి చేయటమూ చేయించటమంటే అవి తనకు మధ్యలో సంక్రమిస్తే వదిలేస్తాడా. లేక అసలు సహజంగానే తనకవి లేవా అని ప్రశ్న వచ్చింది. వస్తే మధ్యలో రావటం కాదు. సహజంగానే ఆత్మకవి లేవంటున్నారు ఆచార్యులవారు. ఎలా చెప్పగలరని అడిగితే మొదటనే చెప్పింది గదా గీత అవికార్యోయముచ్యతే - ఏ వికారమూ లేదాత్మకని సమాధాన మిస్తాడు. అంతేకాదు. శరీర స్థోపి కౌంతేయ నకరోతి నలిప్యతే. శరీరంలో ఉన్నా ఆత్మ ఏపనీ చేయటం లేదు. చేయటంలేదు గనుకనే ఏ కర్మ ఫలమూ దానినంటదని తరువాత రాబోయే శ్లోకాన్ని కూడా ఉదాహరించి సమాధాన పరుస్తారాయన. మరి కర్మలేమిటి. ఎవడు చేస్తున్నాడవి. చేసినా చేయక పోవట మేమిటని ప్రశ్న వస్తే దానికిప్పుడు గొప్ప పరిష్కారం చేస్తున్నది భగవద్గీత.
న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః |
న కర్మఫలసంయోగం స్వభావస్తు ప్రవర్తతే || 14 ||
Page 405