కర్మసన్యాస యోగము
భగవద్గీత
మాత్రాత్మదర్శీ స సర్వోపి దేహే భూమౌ ఆసనే వా ఆసే ఇతిమన్యతే. బాబూ దేహమే నేను అని భావించే వాడికీ దేహి అనిపేరే. అది నాది అని భావించేవాడికీ దేహి అని పేరే. దేహమే నేనయి పోయినవాడు తాను దేహంలో ఉన్నానని అనుకోలేడు. ఒక ఇంట్లోనో ఒక గదిలోనో ఒక కుర్చీలోనో కూచున్నట్టు దేహంలో కూచున్నానని చస్తే చూడలేడు. కారణ మేమంటే దేహమే వాడయిపోయాడు. ఇక దేహంలో ఎలా ఉండగలడు. ఇల్లే నేనను కొంటే ఇంట్లో ఉండగలనా. ఇల్లు నీకు అన్యమని భావిస్తేనే ఇంట్లో ఉండగలవు. అలాగే దేహం నీకు అన్యమని భావిస్తేనే దేహంలో ఉండగలవు. అలా భావించటం లేదు అజ్ఞాని. కనుక వాడు దేహంలో ఉన్నాడని చెప్పరాదు.
మరి ఎవడైతే చెప్పగలం. జ్ఞాని అయితే చెప్పగలం. జ్ఞాని దేహమే నేనని దానితో ఏకమైపోడు. నేనని కాక నాదని చూస్తాడు వాడు. గనుక ఒక ఇంట్లో ఉన్నట్టు దేహంలో ఉండటంకూడా వాడికి సాధ్యం. దేహాది సంఘాత వ్యతిరిక్తాత్మ దర్శినస్తు దేహే ఆసేఇతి ప్రత్యయః ఉపపద్యతే. వాడికి చెల్లుతుంది దేహంలో ఉన్నాననే మాట. కారణం దానికి తన స్వరూపం విలక్షణమని చూస్తున్నాడు వాడు. అయితే తనకు విలక్షణమని చూడగలవాడు దానిలోనే ఎందుకు కూచోవలసి వచ్చింది. ప్రారబ్ధ ఫలకర్మ సంస్కార శేషాను వృత్త్యా దేహ ఏవ విశేష విజ్ఞానోత్పత్తేః అని సమాధాన మిస్తారు భాష్యకారులు. ఎంత జ్ఞాని అయినా ప్రారబ్ధ కర్మ ఫల శేషముంది వాడికి - దానివల్ల క్షుత్పిపాసాది విశేష జ్ఞాన మేర్పడుతుంది జీవితంలో. అందుకోసం వాడూ దేహంలో ఉండవలసి వచ్చింది. ఉన్నా దానితో తాదాత్య్యం చెంద డజ్ఞాని లాగా. అంచేత ఉన్నా లేనట్టే. ఎక్కడ. నవ ద్వార
Page 404