సాగే సహజకర్మలున్నా జ్ఞాన దృష్టిలో ఎప్పటికప్పుడు సమసిపోతాయి. కాబట్టి ఉన్నా లేనట్టే. కర్మ నిష్కర్మ అవుతుంది. అదే సన్న్యాసం. అది కూడా జ్ఞానాత్మకంగానే అనుభవానికి వస్తుంది. కాబట్టి కర్మయోగ మవలంబించే వాడికిక కలిగే మహాఫలమిది. వాడు యుక్తుడు.
అలాకాక అయుక్తుడని పేర్కొన్నామే వాడీ మోక్షమనే మహాఫలాన్ని ఏ జన్మకూ ఆసించలేడు. జ్ఞానానికే నోచుకోలేడు వాడు. ఇక మోక్ష మేమిటి. కలలోని వార్త. మరి వాడికి కలిగే దేమిటి. ఏమిటనే ప్రశ్నేముంది. అయుక్తః కామకారేణ. అయుక్తుడు వాడు. కర్మను యోగంగా అభ్యసించే నేర్పులేదు. కేవలం యాంత్రికంగా ఆచరిస్తుంటాడు. అదీ అహంమమలు వదలకుండా అలా వదలకుండా చేస్తే అది కామకార మంటారు. ఇష్టానుసారంగా చేయట మవుతుంది. శాస్త్రవిహితం గదా ఇష్టానుసార మెలా అవుతుంది. ఎంత విహిత కర్మ అయినా అహం కరిష్యే అనే సంకల్పం లేకుండా మమ ఫలాయ అని ఫలాభిమానం లేకుండా చేయడు గదా. ఫలం మీద ఇష్టముంది కాబట్టి ఇష్టాను సారమే అదీ.
అయితే ఏమిటి నష్టం. వాడు కోరిన స్వర్గాదులే లభిస్తాయి గాని అభించ వలసిన మోక్షఫలం వాడు కోరటం లేదు కాబట్టి లభించదు. అంతకన్నా నష్టమేముంది. అదే పెద్దనష్టం. తాత్కాలికంగా స్వర్గాది భోగాలను భవించి మరలా వచ్చిపడ వలసిందే కర్మభూమిలో. ఇక పరిష్కార మేముంది జీవిత సమస్యకు. కనుక ఫలేసక్తో నిబధ్యతే ఫలాభిమానమే వాణ్ణి బంధిస్తుంది. బంధకమే కర్మానుష్ఠానం మోచకం కాదు. మోచకం
Page 401