#


Index

కర్మసన్యాస యోగము

చేయటమంతా. ఆ ఈశ్వరుడి కోసమేననే దివ్యస్మృతితో చేస్తూ పోయేవాడు యుక్తుడు.

  అటాంటి దృష్టితో చేస్తే కర్మఫలం త్యక్త్వా - కర్మ ఫలం వాడినంటదు. ఎందుకంటే త్యక్త్వా. దాని మీద అభిలాష లేదు వాడికి అక్కర లేదనుకొన్నాడు. మరి జీవన మెలాగా. ఏది చేసినా ప్రారబ్ధం కొద్దీ ఏది వాడికి ప్రాప్తవ్యమో అది ఎలాగూ ప్రాప్తిస్తుంది. కనుక జీవనం సాగిపోతూనే ఉంటుంది. దాని కవరోధం కలగదు. కనుక ఆందోళన పడడు. కర్తృత్వం తాను పెట్టుకోలేదు గదా. ఇక అనుకూలమూ ప్రతికూలమూ అనే చింతే ముంది. అనుకూలమే జరగాలి ప్రతికూలం జరగకూడదని భావించినప్పుడే చింత. అది లేకుంటే నిశ్చింతే ఆ మనస్సుకు.

  మనసు నిశ్చింత మయితే చాలు. నిశ్చలతత్త్వేజీవన్ముక్తిః అన్నారు. శాంతి మాప్నోతి నైష్ఠికీమ్. శాంతి అనేది చెప్పకుండానే లభిస్తుంది వాడికి. శాంతి అంటే మోక్షమని అర్ధం వ్రాశారు భాష్యకారులు. సంసార తాపత్రయ మున్నంతవకూ అశాంతే. అదిపోతే కలిగే శాంతి మోక్షం గాక మరే దవుతుంది. అందులోనూ నైష్ఠికీమంటున్నది గీత. నిష్ఠాయాం భవామ్ సత్త్వశుద్ధి జ్ఞాన ప్రాప్తి సర్వకర్మ సన్న్యాస జ్ఞాన నిష్ఠా క్రమేణ అని వివరించారు భగవత్పాదులు. ఎలాంటి శాంతి అట. నైష్ఠికీ. జ్ఞాన నిష్ఠ వల్ల కలిగే శాంతి. అది ఎలా లభిస్తుందా నిష్ఠ. దీని కొక క్రమ ముందంటా రాయన. మొట్టమొదట కర్మ యోగంతో ప్రారంభ మవుతుంది సాధనం. తరువాత సత్త్వశుద్ధి. దానివల్ల సర్వమూ ఆత్మ స్వరూపమేననే జ్ఞాన ముదయిస్తుంది. ఉన్నదంతా జ్ఞానమే అయితే ఇక కర్మలేదు. అంటే శాస్త్రోక్త కర్మలదే పనిగా చేయ నక్కరలేదు. మానేయాలి. పోతే ప్రారబ్ధవశాత్తూ

Page 400

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు