#


Index

కర్మసన్యాస యోగము

  మమత్వ వర్జనాయ. శరీరాదులతో దేనితో చేసినా నాకోసమనే మమత్వ బుద్ధి ఉంటుంది సహజంగా. అది వదిలేసి చేయాలట పని. అది ఎలాగని అడిగితే వివరిస్తున్నారు. ఈశ్వరాయైవ కర్మకరోమి - నమమ ఫలాయ ఇతి మమత్వ బుద్ధి శూన్యైరింద్రియైరపి. మమత్వమనే దెప్పుడూ బుద్ధిలోనే ఉంటుంది. అదిపోగొట్టు కోవాలన్నా బుద్ధితోనే పోగొట్టుకోవాలి. బుద్ధి కది లేకుండా పోవాలంటే మరో బుద్ధి అలవడాలి. అదే ఈశ్వరార్పణ బుద్ధి. చిన్న రేఖ పెద్దది కావాలంటే దాన్ని పొడిగిస్తూ పోవాలి. అప్పుడు చిన్నది కనపడదు. దాని స్థానంలో పెద్దదే కనిపిస్తూంటుంది. అలాగే అహంమమలు వర్ణించి పనిచేస్తే చిన్నదైన జీవ బుద్ధి అతి పెద్ద దైన ఈశ్వర బుద్ధి స్థాయికెదిగే అవకాశముంది. కాబట్టి ఈశ్వరుణ్ణి కర్మ ఎలా బంధించదో వాడికీ కర్మ బంధకం కాదని తాత్పర్యం.

యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీమ్ |
అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే || 12 ||

  అందుకే అటుతిప్పి ఇటు తిప్పి అనేక విధాలుగా బోధిస్తున్నాడు పరమాత్మ మనకు కర్మయోగ ప్రభావాన్ని. యుక్తుడూ అయుక్తుడూ నని ఇద్దరే ఉన్నారు మానవులలో. యుక్తుడంటే యోగ యుక్తుడు. ఇంతకు ముందే అక్కడ కూడా వర్ణించింది వాడి స్వరూపాన్ని గీత. ఏ పని చేసినా ఈశ్వరాయ కర్మకరోమి న మమ ఫలాయ - ఇత్యేవం సమాహితః. నా కన్నా అనంతమైన ఒక మహాశక్తి ఉంది. ఈశ్వర చైతన్యం. అదే నాచేత చేయిస్తున్న దీ పనులన్నీ. దానికి నేనొక భృత్యుడను -ఒక సేవకుడు స్వామి కార్యమెలా చేస్తూపోతాడో - అలాగే నేను కూడా నాకోసం కాదీ కర్మ

Page 399

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు