#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

  వదిలేసిన సమత్వ బుద్ధే యోగ బుద్ధి. అలాంటి వారికే యోగులని పేరు. వారు పాటించేది కర్మ యోగం. ఎందుకోసం పాటిస్తారు వారు కర్మలంటే చెబుతున్నాడు ఆత్మశుద్ధయే. ఆత్మను శుద్ధి చేసుకోటానికట. ఆత్మేమిటి దానికి శుద్ధేమిటి. మళ్లీ మన మిక్కడ బోల్తాపడకూడదు. అసలైన ఆత్మకాదిది. దానికి నకిలీ. మనస్సు. దీనికే సత్త్వమని కూడా నామాంతరం. అహంమమలనే మాలిన్యం పట్టింది దేనికి. మానవుడి మనస్సుకు. అందువల్లనే పరిశుద్ధమైన ఆత్మ అక్కడే ఉన్నా మనకు కనపడటం లేదు. మరుగు పడి పోయింది.

  అయితే మరి దేనితో చేయాలి కర్మ. కర్మ అన్నప్పుడు దానికి కావలసిన సామగ్రి కూడా ఉండాలి గదా. దానికే కరణమని వేరు. కరణమేమిటి అవి ఎక్కడ ఉన్నాయి. ఏమిటి ఎక్కడ ఉన్నాయని అడగక్కరలేదు. నీదగ్గరే ఉన్నాయి - ఎప్పుడూ నిన్ను అంటి పెట్టుకొనే ఉన్నాయి. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రి యైరపి. శరీరమూ మనస్సు బుద్ధి ఇంద్రియాలు.

  ఇవే కరణాలు. పనిముట్లు. ఇవి నీ దగ్గరే ఉన్నాయి. వీటితోనే నీవే పని చేసినా చేస్తుంటావు. ఇవి లేకుండా కర్మ చేయట మసాధ్యం. కనుక డాక్టరు తన పరికరాలను శుద్ధి చేసుకొన్నట్లు నీవు వీటిని శుద్ధి చేసుకో. అలా చేసుకొని ఏ కర్మ అయినా చేస్తూపో. నిన్నది బంధించదు. ఇక్కడ కేవలైః అనే మాట ఒక్క ఇంద్రియాలకే గాదు. శరీరం దగ్గరి నుంచీ అన్ని కరణాలకూ వర్తిస్తుం దంటారు భగవత్పాదులు. కేవలమంటే ఏమిటో దాని కర్ధం చెబుతున్నారు వినండి ఆయన. మమత్వ వర్జితైః - సర్వవ్యాపారేషు

Page 398

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు