కర్మసన్యాస యోగము
భగవద్గీత
కావాలంటే అదే అనుష్ఠానంగా గాక యోగంగా మారాలి. మారితే అది అంచెలవారిగా నీకు మోక్షఫలాన్ని అందిస్తుంది.
సర్వకర్మాణి మనసా సంన్యస్యాస్తే సుఖం వశీ |
నవద్వారే పురే దేహీ నైవ కుర్వన్ న కారయన్ || 13 ||
ఇలాంటి కర్మ యోగం ద్వారా చివరకు జ్ఞాన యోగమనే భూమిక నందుకొని అందులో నిలదొక్కు కొన్నవాడు జ్ఞాన నిష్ఠుడు. అలాంటి జ్ఞాన నిష్ఠుడి వ్యవహరమెలా ఉంటుందని అడిగితే దానికి సమాధాన మిస్తున్నది గీత. సర్వకర్మాణి సన్న్యస్య. అన్ని కర్మలూ సన్న్యసిస్తా డట వాడు. అన్ని అంటే ఏమిటా అన్ని. నిత్యం నైమిత్తికం కామ్యం ప్రతిషిద్ధంచ తాని సర్వాణి కర్మాణి. నిత్య నైమిత్తికకామ్యాలు మూడూ శాస్త్రం విధించినవి. ప్రతి షిద్దా లనేవి శాస్త్రం నిషేధించినవి. విధి నిషేధాలు రెండూ వదిలేయాలి జ్ఞాని. పరిశేష న్యాయంగా ప్రారబ్ధవశాత్తూ జరిగే కర్మలు వదిలేయటం సాధ్యం కాదు కనుక అవి మాత్రం సాగిపోతుంటాయి. అయితే ఎప్పటికప్పుడు కర్మలో ఆకర్మను చూస్తూంటాడు కాబట్టి కర్మ గాదది. జ్ఞానమే వాడి దృష్టికి. కనుక చేయకుండా కొన్ని చేస్తూ కొన్నీ మొత్తానికన్నీ సన్న్యసించినట్టే. సన్న్యసిస్తే ఎక్కడికి పోతాయవి. - జ్ఞానంగా మారిపోతాయి. కనుక కర్మగా వదిలేశాడు. జ్ఞానంగా ఉంచుకొన్నాడు. సన్న్యాస శబ్దానికి త్యాగమూ నిక్షేపమూననే రెండర్థాలూ సరిపోయా యిప్పుడు. ఇదే కర్మ సన్న్యాసమనే మాట కసలైన అర్ధం.
అయితే కర్మలన్నీ ఎలా సన్న్యసించాలి. సన్న్యసించి ఎక్కడ కూచోవాలి జ్ఞాని. మనసా సన్న్యస్య. మనసుతో సన్న్యసించాలి. మనసా
Page 402