#


Index

కర్మసన్యాస యోగము

కాదని అర్ధం చేసుకోవా లంటారాయన. అందుకే యోగయుక్తో మునిర్ర్బహ్మ అధిగచ్ఛతి అంటే బ్రహ్మ శబ్దానికి పరమాత్మ అని గాక పరమాత్మ జ్ఞానమని అర్ధం చెప్పవలసి వచ్చిందాయన.

యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః |
సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే || 7 ||

  కర్మయోగం జ్ఞాన యోగాని కుపాయమనే మాటి మాటికీ చాటి చెబుతున్నది. ఇంతకు ముందూ వచ్చిందీ మాట. ఇప్పుడూ వచ్చింది. స్వామి వారు వ్రాస్తున్నారు. యదాపునరయం సమ్యగ్ జ్ఞాన ప్రాప్యు పాయత్వేన అని. సమ్యగ్ జ్ఞానోదయ మేర్పడాలంటే దానికి పూర్వ రంగం కర్మ యోగమే మరేదీ కాదంటున్నా రాయన. అలాంటి కర్మయోగ మవలంబించి కొంత కాలం శిక్షణ పొందితే విశుద్ధాత్మా దానివల్ల విశుద్ధ మవుతుంది వాడి ఆత్మ.

  ఆత్మ విశుద్ధం కావట మేమిటి. ఆత్మ అంటేనే శుద్ధమైనది గదా. శుద్ధమైన దొకటీ అశుద్ధమైన దొకటీ రెండున్నాయా ఆత్మలు. శుద్ధే కావలసి వస్తే అసలది ఆత్మ ఎలా అయింది. కాకపోయినా సాకారమూ పరిచ్ఛిన్నమూ అయితే గదా శుద్ధి పొందటానికి. ఆత్మ అంటే అది జ్ఞాన స్వరూపం. జ్ఞానాని కాకార మంటూ లేదు. ఆకాశం లాంటి దది. ఆకాశం లాగే వ్యాపకం కూడా. నిరాకారమే వ్యాపిస్తుంది గాని సాకారమైన దెప్పుడూ వ్యాపించదు. ఆకాశమే అలాంటి దయినప్పుడు దానికి కూడా సాక్షియైన

Page 387

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు