కర్మసన్యాస యోగము
భగవద్గీత
ప్రయత్న పూర్వకంగా ఆచరించకపోతే దుఃఖ మాప్తుం - జ్ఞాన భూమిక నందుకోట మసాధ్యం. అయితే అది ఎప్పుడు సాధ్యపడుతుందని అడుగుతావా. యోగయుక్తః - వైదికేన కర్మ యోగేన ఈశ్వర సమర్పిత రూపేణ ఫలనిరపే క్షేణ యుక్తాః అని వ్యాఖ్యానిస్తున్నారు భగవత్పాదులు. ఏకర్మ అయినా చేయి. ఈశ్వరార్పణ బుద్ధితో ఫలనిరపేక్షంగా చేస్తే అది యోగం. దాన్ని పాటిస్తూ పోయేవాడు యోగయుక్తుడు. అలాంటివాడే మునిః మనన శీలుడు. ఈశ్వర స్వరూపాన్ని ఎప్పుడూ మనసుకు తెచ్చుకొంటూ తదేక భావన కలిగి ఉంటాడు.
బ్రహ్మ నచిరేణ అధిగచ్ఛతి. వాడు బ్రహ్మాన్ని అందుకోగలడు. అలా అందుకోటానికి కూడా ఎంతోకాలం పట్టదు. నచిరేణ అనతి కాలంలోనే శీఘ్రంగానే సాధించగలడు. బ్రహ్మమేమిటి. బ్రహ్మ స్వరూపమా - మోక్షమా అని ప్రశ్న వస్తే స్వామివారు వివరణ ఇస్తూన్నారు శబ్దానికి. కర్మయోగి పొందే బ్రహ్మం మీరూమేమూ ఊహించే పరమాత్మ కాదు. సన్న్యాసస్తు మహాబాహో అని ఇంతకు ముందే పేర్కొన్నాడే అది. ఏమిటది జ్ఞానం. పరమార్ధ జ్ఞాన నిష్ఠా లక్షణ మని అర్ధం చెప్పారు. న్యాస ఇతి బ్రహ్మా బ్రహ్మాహి పరః అని శ్రుతి వాక్యాన్ని కూడా ఉదాహరిస్తాడీ సందర్భంలో ఆయన. ఇంతకూ కర్మయోగం బాగా పాటిస్తూ పోతే ఆ శిక్షణ ఫలిస్తే తత్ఫలితంగా కర్మయోగి అందుకొనే పదం పరమార్ధ జ్ఞానమని పేర్కొంటారు. స్వామివారు. కర్మజ్ఞానానికీ జ్ఞానం మోక్షానికీ దారి తీస్తుంది. ఇదీ వరస. అంటే కర్మజ్ఞానం ద్వారా మోక్షమనే ఫలితమిస్తుంది గాని స్వతంత్రంగా
Page 386