కర్మసన్యాస యోగము
భగవద్గీత
పోతే ఇక్కడ అలాకాదు. రెండూ కలిసి ఇచ్చే ఫలితం చివర కొక్కటే అది ఒక్కటి. అంచేత ప్రయత్న దృష్ట్యా వేరయినా ఫల దృష్ట్యా వేరుకావు ఏకమే నని చెప్పవలసి వచ్చింది. ప్రయత్నం ఫలితంలో కలిసి వస్తుంది. కాబట్టి ఎప్పుడూ ఏకమే తత్త్వం. అందుకే ద్వివిధానిష్ఠా అని ఏకవచనంలోనే ప్రయోగించాడు నిష్ఠా అనే మాట. రెండు నిష్ఠలు కావవి. ఒకే నిష్ఠ. దానికి రెండు భూమికలు Stages. అదీ ద్వివిధా అంటే.
సంన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః |
యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్ఛతి || 6 ||
ఈ రహస్యాన్నే ఇంకా చక్కగా వివరించి చెబుతున్నది గీత. సన్న్యాసస్తు మహాబాహో సన్న్యాసమంటే ఏమను కొంటున్నావు నీవు. అది జ్ఞానం. సవికల్పం కాదు. నిర్వికల్పమైన ఆత్మజ్ఞానం. అది ఊరక వచ్చి ఒళ్లో బడుతుందను కొంటున్నావా. మామూలు జ్ఞానమే పడదలా. ఇక అన్ని పదార్ధాల లోపలా వెలపలా వ్యాపించి ఉన్న సామాన్య జ్ఞానమెలా సిద్ధిస్తుంది. అయితే మరి ఎలా కలుగుతుం దంటారు. ఏదైనా ప్రయత్నిస్తేనే ఫలితం. ప్రయత్నం లేకుండా ఫలమేర్పడే ట్టయితే అందరమూ మూకుమ్మడిగా ముక్తులమయి పోవచ్చు. ఏదీ ఎవరి కున్నదా అనుభవ మిప్పుడు. దుఃఖ మాప్తు మయోగతః - అయితే మరెందుకు లేదు. ప్రయత్నం.
ఏమిటా ప్రయత్నమని అడుగుతావా. కర్మయోగం. కర్మయోగ ముపాయం. అహం మమలు వదిలేసి చేసే ప్రతి కర్మాయోగమే. అది
Page 385