సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః |
ఏకమప్యాస్థితః సమ్యగుభయోర్విందతే ఫలమ్ || 4 ||
ఇప్పు డున్నట్టుండి పేర్లు మార్చి పారేస్తున్నాడు పరమాత్మ. సాంఖ్యయోగౌ అని మరి రెండు కొత్త మాటలు పట్టుకు వచ్చాడు. సన్న్యాసం కర్మయోగమని చెబుతూ చెబుతూ ఈ మాటలేమిటి. పరవాలేదు. ఇందులో సాంఖ్యమనే మాట సన్న్యాసమే. యోగమనే మాట కర్మయోగమే. మరేవో గావు. పిల్లీ మార్జాల మన్నట్టు రెండూ ఒకటే. ఇంతకూ ఆయన మనకు చెప్పదలచిన విషయమేమిటి. సాంఖ్యయోగౌ పృధగ్బాలాః ప్రవదంతి నపండితాః - సన్న్యాస కర్మ యోగాలు రెండింటినీ వేరుగా చూస్తున్నారు చెబుతున్నారు చాలామంది లోకంలో. అలా చూచే వారందరూ బాలాః మూఢులు. ఏమీ తెలియని అజ్ఞానులట. మరి జ్ఞానులెవరు. న పండితాః అలా వేరుగా గాక రెండూ ఒకటేనని గ్రహించిన వారెవరో వారే పండితులట.
రెండూ ఒకటే ఎలా అవుతాయని అడిగితే రెండూ చివరకు మనకందించే ఫలమొకటే గదా అంటారు భగవత్పాదులు. జ్ఞానానికొక ఫలం కర్మకొక ఫలమంటూ వేరుగాలేవు. రెండూ కలిసి ఒకే ఒక మోక్ష ఫలాన్ని మన కిస్తున్నాయి. కర్మయోగం జ్ఞానం ద్వారా ఇస్తే - జ్ఞానం సాక్షాత్తుగా అందిస్తుంది. ఒకే మార్గంలో మొదటి మజిలీ యోగం. రెండవ మజిలీ జ్ఞానం. మొదటిది ఉపాయం. రెండవది ఉపేయం. ఉపాయ
Page 380