#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

ముపేయాని కందిస్తే - ఉపేయం మోక్షాని కందిస్తుంది. ఇదీ వరస. ఇదంతా చివరకు మోక్షంతో సమాప్త మవుతున్నది. కనుక ఫలదృష్ట్యా కర్మా జ్ఞాన మొక్కటే. తేడా లేదు. ప్రయాణంలో రెండుగా కనిపించినా పర్యవసానంలో రెండు గావవి. ఒక్కటే తత్త్వం.

  ఏక మప్యాస్థిత స్సమ్య - గుభ యోర్విందతే ఫలమ్ - వాటిలో ఏ ఒక్కటైనా చక్కగా మనసు పెట్టి దీక్షగా ఆచరిస్తూ పోతే చాలు. రెండింటి ఫలితమూ పొందవచ్చు. రెండింటికీ ఫలితం మోక్షమది ఒక్కటే. అది కర్మయోగం చక్కగా ఆచరించచినా లభిస్తుంది. జ్ఞానమభ్యసిస్తూ పోయినా ప్రాప్తిస్తుంది. అయితే ఒకటి జ్ఞానం ద్వారా ఇస్తుందా ఫలితం. ఇంకొకటి సరాసరి ఇస్తుందది. ఎలా ఇచ్చినా మోక్షం మోక్షమే. అందులో తారతమ్యం లేదు.

యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే |
ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి || 5 ||

  అందుకే సాంఖ్యమనీ యోగమనీ పేరేగాని రెండూ ఒకటే. సాంఖ్యులైన వారికే స్థానం లభిస్తుందో చివరకు కర్మయోగులకు కూడా అదే దక్కుతుంది. యత్సాం ఖ్యైః ప్రాప్యతే స్థానం - తద్యోగైరపి గమ్యతే అంటే అర్ధమిది. స్థానమంటే ఫలమిక్కడ. ఏమిటది. మోక్షమని ఇంతకు ముందే వర్ణించాడు. అయితే ఒకచోట సన్న్యాసమని ఒకచోట యోగమని అంటాడేమిటి పరమాత్మ. మాట మార్చటంలో ఉద్దేశమేమిటి. ఏ ఉద్దేశమూ లేదు. రెండూ ఒకటే. ఒక దానికొకటి పర్యాయ పదాలు Synonymns

Page 381

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు