కర్మసన్యాస యోగము
భగవద్గీత
ఇంతెందుకు. సాంఖ్యం - జ్ఞానం - సన్న్యాసం - ఇవి మూడూ ఒకటి. కర్మ - కర్మ యోగం - యోగం ఇవి మూడూ ఒకటి. అందుకే మార్చి మార్చి వాడుతుంటుంది భగవద్గీత వీటిని. మనం మాత్రం గాబరా పడగూడదు. పిల్లి మార్జాలం బిడాలమనే మాటలు విని కంగారు పడతామా. మూడూ కలిసి చెప్పే అర్థమొక్కటే నని గ్రహించినప్పుడు సందేహమేముంది అలాగే ఇదీ.
ఇంతకూ కర్మయోగం జ్ఞానయోగమే నన్నమాట సాంఖ్యయోగాలంటే. వాటి రెండింటికీ ఫలిత మొక్కటే - అది మోక్ష మంటున్న దిప్పుడు గీత. అయితే జ్ఞానాన్ని వదిలేసి కర్మయోగం పట్టుకొంటే సరిపోతుందా. అలాగే కర్మయోగాన్ని మానేసి జ్ఞానయోగంతో సరిపుచ్చుకోవచ్చా - అని ప్రశ్న వస్తుంది. అలా కాదు. జ్ఞాన ముదయించాలంటే కర్మయోగం కావాలి. కర్మ శిక్షణ - జ్ఞాన ముద్యోగం. శిక్షణ పొందితే గాని ఉద్యోగం దొరకదు. కాబట్టి కర్మ సాధనం జ్ఞానానికి. అది లేకుండా ఇది రాదు. దాని అవసరముంది దీనికి. అలాగే జ్ఞాన ముదయించిన తరువాత మోక్షం లభిస్తుంది గదా ఇక కర్మ దేనికి అంటే- అప్పుడు జ్ఞానికి కూడా కావలసి ఉంది కర్మ. ఎందుకని. జ్ఞానికింకా శరీరమనే ఉపాధి ఉంది గదా. ఉపాధి ఉన్నంతవరకూ కర్మ తప్పదు.
అయితే జ్ఞాన ముదయించి ఏమి సుఖమని అడగవచ్చు. అది జరుగుతున్నా దాన్ని వాడు జ్ఞానదృష్టితో చూస్తుంటాడు. కాబట్టి బంధకం కాదు వాడికి. మీదు మిక్కిలి జ్ఞానే పరిసమాప్యతే అని భగవానుడే చెప్పినట్టు
Page 382