#


Index

కర్మసన్యాస యోగము భగవద్గీత

ఎప్పటికప్పుడు లయమవుతూ పోతుంది జ్ఞానంలో. అయితే అప్పుడిక కర్మ జ్ఞాన మనే తేడా లేదు. అంతా జ్ఞానాత్మకంగానే అనుభవానికి వస్తుంది. జ్ఞానం తన స్వరూపంగా Essence కర్మ దాని విభూతిగా Expansion దర్శన మిస్తుంటుంది. ఇది జ్ఞానకర్మ సముచ్చయమని భ్రాంతి పడరాదు మరలా. అది అనుష్ఠాన రూపమైన కర్మ. ఇది కేవల మను ష్ఠానం కాదు. యోగం. అంటే జ్ఞానం కోసం చేసేదొకటి - జ్ఞాని అయి చేసేదొకటి. రెండు విధాలీయోగం. జ్ఞానం కోసం చేసేది ప్రయత్నం. అదీ యోగమే. జ్ఞాని అయి చేసేది ప్రవర్తన. అదీ యోగమే. ఇందులో ఏదీ జ్ఞానాని కడ్డు తగలదు. అసలవి రెండూ కలిసి కాపురం చేస్తేగదా. జ్ఞానం కోసమని చేసే కర్మయోగం జ్ఞానోదయానికి పూర్వం కాబట్టి అక్కడా అవి రెండూ కలవటానికి వీలులేదు. పోనీ జ్ఞానానంతర మంటారా. అప్పుడా జ్ఞాని చేసే ప్రతి కర్మా జ్ఞాన మయమై పోతుంది కాబట్టి జ్ఞానానికి వేరుగా కర్మ కనపడనే కనపడదు. ఇక అప్పుడూ కలిసే ప్రసక్తి లేదు. కనుక అహం మమలు వదలని అనుష్ఠాన కర్మ నుద్దేశించి చెప్పిన మాట జ్ఞానకర్మ సముచ్చయం. యోగరూపమైన కర్మను గాదు.

  అంచేత ఏకం సాంఖ్యంచ యోగంచ - సాంఖ్యమూ యోగమూ అంటే అర్ధం-జ్ఞానమూ కర్మ. రెండూ ఏకమే ఒక్కటే. తేడా లేదని భావించాలి. అలాచూడాలి. యః పశ్యతి. ఎవడయితేఅలా చూడగలడో. పశ్యతి. వాడే చూపు బాగా పనిచేస్తున్నవాడు. మనమూ చూస్తున్నాము

Page 383

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు