అపోహ. సన్యాసమంటే అన్ని కర్మలూ ఎగగొట్టి కాషాయాలు కట్టుకొని పారిపోవటమని లేదా చేస్తే నిత్యనైమిత్తికకామ్య కర్మలన్నీ తూచా తప్పకుండా యాంత్రికంగా పాటిస్తూ అలా పాటించటం మూలంగా పరమ పవిత్రుల మయ్యామని - తాత్కాలికంగా నేడో రేపో స్వర్గానికి టిక్కెట్టు తీసుకొని పోయి అక్కడ దేవేంద్ర భోగాలను భవించగలమని,
ఇలాంటి అపోహ లన్నింటికీ ఇది ఒక పెద్ద అడ్డుకట్ట. కర్మ లెగగొట్టి సన్న్యసించినా రాదు - లేక గుడ్డిగా ఆచరించినా రాదు మోక్షం మానవుడికి. రెండూ రెండు కొసలు. కొసలలో కాదది. మధ్యే మార్గంలో ఉంది. ఫల త్యాగంతో కర్మ నొక యోగంగా ఆచరించి నప్పుడవి రెండూ కలిసి నిః శ్రేయస మనే ఒకే ఒక గొప్ప ఫలితమిస్తాయి. అది స్వర్గాది భోగాలు కాదు. ఉత్తమ జన్మ ప్రాప్తి గాదు. ఆత్మ జ్ఞాన రూపమైన నిఃశ్రేయసం. మోక్షమని అర్ధం. దేని కంటే శ్రేయస్సు లేదో అది నిఃశ్రేయసం. ధర్మపురు షార్ధం శ్రేయస్సే గాని నిఃశ్రేయసం కాదు. నిఃశ్రేయసం నివృత్తి ధర్మమైన మోక్షమొక్కటే. ఫలం గాని ఫలమది. ఆత్మ స్వరూప జ్ఞానమే మోక్షం. క్రొత్తగా పొందేది గాదది స్వర్గంలాగా. సిద్ధమైన దానిని గుర్తించటమే.
తయోస్తు కర్మసన్న్యాసా త్కర్మయోగో విశిష్యతే. అంచేత తొందరపడి కర్మలు సన్న్యసించటమే సన్న్యాసమని పొరబాటుపడి ఎక్కడికీ పరుగెత్తి పోకు. అలా పరుగెత్తి పోతే ఇంటి కూటికీ దోవ కూటికీ చెడిపోతావు. కర్మా లేదు నీకు జ్ఞానమూ లేదు. రెంటికీ చెడ్డ రేవడివి నీవు. కాబట్టి
Page 377