అది అసంభవమని గీత చెబుతున్నది గదా. అలాగే కర్మలు చేయటమంటే ఫలకామనతో చేయమని ఎవరు చెప్పారు నీకు. ఫలాసక్తి లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయటమని ఎందుకు భావించరాదు. అందుకే అసలు కర్మ అని గాక కర్మ యోగమని పేర్కొంటున్నాడు పరమాత్మ. అర్జునుడు కర్మణామని కేవలం కర్మ శబ్దాన్నే ఉదాహరిస్తే కృష్ణుడు యోగమని దానికొక తోక తగిలించి పేర్కొన్నాడు. అంటే ఏమిటర్ధం. కేవలం కర్మ అని మాత్ర మనుకొంటే అది అను ష్ఠానం. అందులో కర్తృత్వ భోక్తృత్వ బుద్ధి తొలగక పోవచ్చు. అదే అనుష్ఠానం కాక యోగంగా భావించి చేస్తే మాత్ర మహంమమ బుద్ధి ఉండదా కర్మలో. అప్పుడది జ్ఞానానికి తోడు పడుతుంది. ఫలదృష్టి వదిలేసి కర్మ ఆచరిస్తాడు కాబట్టి సన్న్యాసమూ అయింది. యోగమూ అయింది. సన్న్యామంటే సన్న్యాసం - యోగమంటే యోగమది.
అయితే అర్జునుడెందుకు కంగారుపడ్డాడు. అతడు సన్న్యాసమంటే కర్మలనే సన్న్యసించట మనుకొన్నాడు. కర్మ ఫలమని భావించ లేదు. అలాగే కర్మ చేయటమంటే సంకల్పించి చేసే అనుష్ఠాన మనుకొన్నాడు. నిష్కామంగా సాగించే యోగమని భావించలేదు. అందుకే అతని భ్రాంతి పొగొట్టటానికే భగవానుడది ఇంతగా వివరించవలసి వచ్చింది. ఇది ఆయన చెప్పింది చెప్పినట్టు గ్రహించగలిగితే ఆ అర్జునుడే గాదు. ఈ నాడు మన బోటి అర్జునులం కూడా కర్మ విషయంలో సన్న్యాస విషయంలో ఇక మీదట భ్రాంతి పడం. ఎందుకంటే ఇప్పటికే లోకంలో చాలామంది కుంది ఈ
Page 376