కర్మసన్యాస యోగము
భగవద్గీత
అది ఏదోగాదు. జ్ఞానం. దీనికే ఆత్మ అని పేరు పెట్టారు వేదాంతులు. అది మన శరీరంలో ఉంది. శరీరం వెలపల సర్వత్రా ఉన్నది. శరీరం మేరకే పరిమితమని భావిస్తే అది జీవాత్మ. సర్వత్రా అదేనని భావిస్తే పరమాత్మ. అంతే తేడా. రెండూ నేను నేననే స్ఫురిస్తుంటాయి. పోతే ఈ ఆత్మకు గోచరించేదంతా ఆనాత్మ అని పేర్కొన్నారు. అదే ఈ పిండ శరీరమూ. ఆ బ్రహ్మండ శరీరమూ. కాని చమత్కార మేమంటే ఈ ఆనాత్మ పైకి అలా కనిపిస్తున్నదే గాని విమర్శించి చూస్తే అది కూడా ఆత్మే వాస్తవంలో. ఆత్మే అనాత్మ ప్రపంచంగా భాసిస్తున్న దన్నమాట. సముద్రమే తరంగ బుద్బుదాలుగా భాసిస్తే ఎలా ఉంటుంది. సముద్రం తన పాటికి తానచలం. తరంగాదులుగా చలం. రెండూ వస్తుతః జలమే. అలాగే ఆత్మ తన పాటికి తాను అచలం. పృధి వ్యాదులుగా శరీర మనః ప్రాణాదులుగా చలం. ఇందులో అచలం స్వరూపమైతే చలం దాని విభూతి Expansion or Manifestation. మరొక భాషలో చెబితే స్వరూపం జ్ఞానం. దాని విభూతి కర్మ. స్వరూపం కంటే విభూతి వేరుగానట్టే జ్ఞానం కంటే కర్మ వేరుగాదు. సువర్ణమూ ఆభరణంలాగా రెండూ ఒక్కటే.
ఈ దృష్టితో చూస్తే మనకర్ధ మవుతుం దిప్పుడు వేదవ్యాస మహర్షి ప్రణాళిక ఏమిటో. ఆయన రచించిన భగవద్గీతలో ఎన్నో అధ్యాయాలు రచించినట్టు కనిపించినా అన్నీ కలిసి ఎన్నో కావు. ప్రతి ఒక్కటీ జ్ఞానకర్మ ప్రపంచమే. వాటి వర్ణనమే. పేర్లు మారుతుంటాయి. విషయమొక్కటే
Page 371