#


Index

విషాద యోగము

మేమిటని అడిగితే అది ఏదోగాదు సన్న్యాసం - తత్ఫలితంగా నీకు కలిగేది మోక్షమే సుమా అని మన కర్తవ్యాన్ని విధిస్తున్నది. చిట్టచివరిదైన మోక్ష సన్యాస యోగమనే అధ్యాయం. మోక్ష సన్న్యాస మంటే మోక్షం కోసం సన్న్యాసం. అంతేగాని మోక్షాన్నే సన్న్యసించటమని గాదు. మోక్షాన్ని సన్న్యసిస్తే మరలా విషాదమే మన పాలిటికి సమస్య పునరావృత్త మవుతుంది. మరి సన్న్యాస మేమిటి. వదులుకోట మని అర్ధం. దేన్ని. నామరూపాలను. అవి సచ్చిదాత్మకమైన తత్త్వాన్ని కప్పివేసి మనకు కనపడకుండా చేశాయి. నామరూపాలే సంసారం. నామం లోపలి భావమైతే రూపం బాహ్యమైన పదార్థం Thing. మొదటిది జీవుడు. రెండవది జగత్తు. ఇదే గదా మనకు బంధం. ఇవి ఆవరించటం వల్లనే ఆత్మ స్వరూపం మరుగు పడింది గనుక దాన్ని పైకి తెచ్చుకోవాలంటే వీటి కప్పు తొలగించుకోవాలి. అదే సర్వధర్మాన్ పరిత్యజ్య, సన్న్యాసమంటే పరిత్యాగమే. సర్వధర్మా లేవో గావు. ఈ నామరూపాలే. ఇవే ధర్మాలు Properties belonging to the self.

  మరి వీటిని వదిలేస్తే పట్టుకో వలసిన దేది. ఆ కొమ్మను పట్టుకొని గదా ఈ కొమ్మను వదిలేస్తా రెవరైనా. ఆ కొమ్మ ఏది. మామేకం శరణం ప్రజ. ఆ కొమ్మ నేనే నంటున్నాడు కృష్ణ భగవానుడు. నేనంటే కృష్ణ విగ్రహం కాదు. అహమాత్మా గుడా కేశ అని గదా సెలవిచ్చాడు. కృష్ణుడంటే నీలమేఘ శ్యామలమైన మూర్తిగాదు. అది ఉపాధి. ఆకాశానికి

Page 37

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు