#


Index



జ్ఞాన యోగము

  ప్రాణవృత్తి నపానంలోనూ అపానవృత్తిని ప్రాణంలోనూ హోమం చేయాలి. ప్రాణాపాన గతీరుద్ధ్వా అలా చేసి ప్రాణా పాన గతులను అంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాస క్రియలను రెంటినీ ఆపేయాలి. అప్పుడు వాయువు లోపలికీ రాదు. వెలపలికి పోదు. రాకపోకలు నిలిచిపోతాయి. అలా నిలిచిపోతే ఏమవుతుందది. కుంభాకారంగా మారుతుంది. అంటే వాయువును లోపలనే కుంభిస్తారు యోగులు. అలాగే కుంభక వృత్తి సాగిపోతే ప్రాణాయామ మంటారు దాన్ని. ప్రాణమంటే జీవితం. ఆయామ మంటే ఎడతెగకుండా సాగటం. జీవనకాలం ఆగకుండా ఎక్కువకాలం సాగించవచ్చు. To extend life time ఇది ఒక రకమైన హఠయోగం. మరణాన్ని జయించటాని కిదే మార్గమని భావిస్తారు యోగులు.

అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి |
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపితకల్మషాః || 30 ||

  ఇంకా కొందరున్నారు మహానుభావులు. నియతాహారాః ఆహార నియమం బాగా పాటిస్తారు వారు. అసలు తినక పోవటం కాదు. నియమమంటే. తింటే అతిగా తినటమూ కాదు. ఎంతో అంతే తింటారు. యుక్తాహారం లేదా మితాహారం పాటిస్తారు వీరు. అలా పాటిస్తూ వారు ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి - ప్రాణాలను ప్రాణాలలో హోమం చేస్తారు.

Page 340

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు