జ్ఞాన యోగము
భగవద్గీత
అంటే అర్ధం. పంచ ప్రాణాలలో ఒక్కొక్క వాయు విశేషాన్ని ఈ నియమ పాలనతో జయించి దానిలో మిగతా వాయువు లన్నింటినీ కలుపుతూ వస్తారు. కలపటమంటే అందులో మిగతా వన్నీ చేరిపోయినట్టు భావించటమే.
సర్వేప్యేతే యజ్ఞవిదః - ఇప్పుడింత వరకూ వర్ణించిన వారందరూ యజ్ఞవేత్తలే. యజ్ఞమంటే ఏదో తెలిసిన వారే. తామెలా భావించారో అంతవరకే ఆ తెలియటం. ఆ మాత్రం తెలిసి చేసినా అదీ ఒక నియమమే. మంచి పనే. కొంతవరకు సాధనే. కాబట్టి యజ్ఞ క్షపిత కల్మషాః తాము చేసిన యజ్ఞమామేరకు వారి శరీర మనోమాలిన్యాన్ని ప్రక్షాళన చేసి వారికా మాత్రం ఫలితమిచ్చి తీరుతుంది. నహికాల్యాణ కృత్ అని గీత తరువాత చెప్పబోతుం దొక సత్యం. ఏదైనా మంచి పనిచేస్తే అది వృధా పోదు. సంపూర్ణమైన మోక్షఫలం గాక పోయినా ఎంతోకొంత ఫలిత మివ్వకపోదు. యక్షా నురూపో బలిః అన్నారు భగవత్పాదు లొకచోట. ఏ దేవతకు తగిన బలి దానికర్పిస్తారట. అలాంటిదే ఇదీ.
యజ్ఞశిష్టామృతభుజో యాంతి బ్రహ్మ సనాతనమ్ |
నాయం లోకోఽస్త్యయజ్ఞస్య కుతోఽన్యః కురుసత్తమ || 31 ||
యజ్ఞ శిష్టామృత భుజః - ఏ యజ్ఞమైనా చేయి నీవు. దానికి తగిన ఫలిత ముంటుందని పేర్కొన్నాము. దాని కమృతమని పేరు పెట్టారు పెద్దలు.
Page 341