#


Index



జ్ఞాన యోగము

  ఒక మాట. అలా కాదు కర్మ చేస్తూ ఉంటాడని ఒక మాట. దీన్ని బట్టి కొందరు శాస్త్రజ్ఞులే ఏమని సిద్ధాంతం చేశారంటే జ్ఞానమూ కర్మా రెండూ ఎప్పుడూ ఉంటాయని అలా ఉంటేనే మోక్షమని కర్మ లేకుండా కేవల జ్ఞానం వల్లనే మోక్షం సిద్ధించదని తీర్మానించారు. దీనికి జ్ఞాన కర్మ సముచ్చయ వాదమని పేరు. కాని అద్వైత విద్యా సార్వభౌముడైన శంకర భగవత్పాదులిది అంగీకరించరు. జ్ఞాన ముదయిస్తే దానికిక కర్మసాహాయ్య మక్కర లేదు. అది స్వతంత్రంగానే మోక్షదాయకమని ఆయన సిద్ధాంతం.

  మరి య జ్ఞాయాచరతః కర్మ - శారీరం కర్మ అని జ్ఞానికి కూడా కర్మ చెబుతున్నది శాస్త్రం. దానినెలా సమర్థిస్తారు శంకురులని అడిగితే ఆయన దానికిచ్చే సమాధానమిది. ఈ కర్మ శాస్త్ర చోదితమైన కర్మ కాదు. ప్రారబ్ధ కర్మ అంటాడాయన. జ్ఞానకర్మ సముచ్ఛయంలో చెప్పే కర్మ శాస్త్రవిహితమైన కర్మకాండ. జ్ఞానోదయమైన వాడికా శాస్త్రీయమైన కర్మ అక్కర లేదు. అసలు పనికిరాదు. పోతే ప్రారబ్ధవశాత్తూ నడిచే కర్మ మాత్రం అది తీరేవరకూ నడుస్తూ పోవలసిందే. అయితే అది జ్ఞానబలంతో నిర్వీర్యమై పోతుంది కాబట్టి ఉన్నా ఇబ్బంది లేదు. యాంత్రికమైన చర్యే అది. లేదా తన జ్ఞానమే అలా ప్రసరిస్తున్నట్టు జ్ఞాన విభూతిగానే చూస్తాడు జ్ఞాని. అది కూడా వాడి దృష్టికి జ్ఞానమే కర్మ కాదు. శాస్త్రీయమైన కర్మా అసలేలేదు. ఈ ప్రారబ్ధ కర్మా ఉన్నా అది కర్మకాదు జ్ఞానమే. కనుక రెండూ జ్ఞానాగ్నిలో దగ్ధమైనవే. ఇది భగవత్పాదులు చేసిన గొప్ప సమన్వయం.

Page 332

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు