మరొకటి మమ. ఈ అహం మమలు రెండూ పోవటమెవరికీ ఇష్టం లేదు. రెండూ ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలనే ఉండ జూచుకొని బ్రతుకుతూ ఉండాలనే మన ఆశ. ఇందులో ఎవరు పోయినా ఒప్పుకోను. నేను పోగూడదు. నావాళ్లూ పోగూడదు.
ఆచార్యాన్ మాతులాన్ భ్రాతౄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్తధా శ్వశురాన్ సుహృదశ్చైవ - సేనయో రుభయో రపి. రెండువైపులా కనిపిస్తున్న వారెవరు. ఎవరో గారు అందరూ మనవాళ్లే. సేనయో రుభయోః అంటే అప్పటికి మిత్రులూ శత్రువులూ - అనే తేడా లేదు. అందరూ పోతారనే భావంతో చూచినప్పుడు శత్రుమిత్ర భేదం లేదు. అంతా కలిసి మానవ మాత్రులే. అంతా మనవాళ్లే. స్వజనమే. ఎవరికి అర్జునుడికా. అర్జును డెక్కడ ఉన్నాడు. మనమే. అందరినీ చూచేసరికి నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ - కింనో రాజ్యేన కింభోగైః - ఎందుకీ రాజ్యం ఎందుకీ సుఖాలు ఏవీ అక్కరలేదనే వైరాగ్య భావం కలుగుతుంది. ఎందుకని. స్వజనం హి కధం హత్వా సుఖినః స్యామ. మనవాళ్లనే చంపుకొని మనం గడించే ఆ సౌఖ్య మేమిటి. మీదు మిక్కిలి పాపమే వాశ్రయే దస్మాన్ - పాపాన్ని మూట గట్టుకొంటా మేమో.
అంతేకాదు. నచైత ద్విద్మః కతరన్నో గరీయో యద్వా జయేమ యది వా నో జయేయుః - అసలీ యుద్ధమనేది జరిగితే మనమే గెలుస్తామని ఏమిటి నమ్మకం. మనమైనా గెలవ వచ్చు. మనం శత్రువులని భావించే
Page 33