#


Index



జ్ఞాన యోగము

కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః |
స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మకృత్ || 18 ||

  అయితే కర్మాదుల స్వరూపమేమిటో అసలు వాటి తత్త్వం లేదా యాధాత్మ్యమేమిటో బోధిస్తానన్నారు. అది బాగా మాకు వివరించి చెప్పండని అడిగితే చెబుతున్నాడు భగవానుడిప్పుడు. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. అద్భుతమైన భావం. కర్మ ఏమిటో నూటికి నూరు పాళ్లూ పరిష్కారం చేసి మన ముందు పెడుతున్నది భగవద్గీత.

  ముందు మామూలుగా శబ్దార్ధం చెప్పుకొంటూ పోదామీ శ్లోకానికి. కర్మ ణ్య కర్యయః పశ్యేత్ - ఎవడైతే కర్మలో అకర్మను చూడగలడో అలాగే అకర్మణి చ కర్మయః - అకర్మలో కర్మనే చూస్తూపోతాడో. సబుద్ధిమాన్ మనుష్యేషు - వాడీ మానవులందరిలో చాలా బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడే కాదు. వాడే యోగి సయుక్తః - కృత్స్న కర్మకృత్ - అంతే కాదు. అన్ని కర్మలూ చేసినవాడూ వాడే. ఇదీ దీని శబ్దార్ధం.

  ఇది ఇలా చెబితే ఏమర్ధమయింది మనకు. అర్ధం కాకపోగా ఏమిటా ఈ అవకతవక ప్రసంగమని పి స్తుంది ఎవడికైనా. ఎందుకంటే కర్మ కర్మే అకర్మ అకర్మే - కర్మ అకర్మ కాదు. అకర్మ కర్మ కాదు. కర్మ అంటే ఒక పనిచేయటం - అకర్మ అంటే పనిచేయకుండా మానటం. పనిచేస్తే మానటం లేదు. మానుకొన్నచోట చేయటమూ లేదు. అన్యోన్య విరుద్ధమైన భావాలివి. అలాంటప్పుడు కర్మలో అకర్మను చూడట మేమిటి. అకర్మ అని చెబుతూ

Page 318

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు