#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  కర్మ అంటే ఏమిటో తెలియాలి మొదట వికర్మ అంటే ఏమిటో తెలియాలి. అలాగే అకర్మ అంటే కూడా ఏమిటో తెలియాలి మానవుడికి. ఎందుకంటే గహనా కర్మణోగతిః - కర్మా కర్మల స్వరూపం ఫలానా అని తేల్చుకోటం చాలా కష్టసాధ్యమైన విషయం.

  ఏమిటింతకూ భగవానుడి వివక్షితం Intention. కర్మ - అనేది ఒకటిగాదు. కర్మ వికర్మ అకర్మ అని అది మూడు విధాలు. అందులో కర్మ అంటే శాస్త్రం నీకూ నాకూ విధించినది. నిత్య నైమిత్తికాది విధులు Dos. వికర్మ అంటే శాస్త్రం నిషేధించినవి Donts. కలంజ భక్షణాదులు. మరి అకర్మ అని ఇంకొక టున్నది. అదేమిటి. ఏపనీ చేయక ఊరక కూచోటం. అది విధీ గాదు. నిషేధమూ కాదు. తూస్జీమాసన మన్నారు భగవత్పాదులు.

  ఎందుకీ వివరణ ఇవ్వవలసి వచ్చిందంటే చెబుతున్నారా యన కర్మ నామ దేహాది చేష్టా - కర్మ అంటే దేహేంద్రియాదుల చలనమే గదా. అకర్మ నామ తదక్రియా తుష్ఠీ మాసనమ్. - అకర్మ అంటే అలా కాలూ చేయీ కదిలించకుండా మౌనంగా మొద్దులాగా ఉండిపోవట మిది లోకంలో మనందరికీ తెలిసిన విషయమేగదా. కింతత్ర బోద్ధవ్యం. ఇందులో క్రొత్తగా తెలియవలసిన దేముందని అనుకోవచ్చు మనం. అలాకాదు. కర్మ అంటే లౌకికం కాదు. సహజ కర్మ కాదది. శాస్త్రవిహితమైన కర్మ. అకర్మ అంటే అదీ ఇదీ ఏ పనీ చేయకుండా కూచోటమనే లౌకికమైన స్థితి కాదు. విహిత కర్మలు పాటించక పోవటమని దాని తాత్పర్యం.

Page 317

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు