#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

ఎవరూ నిష్కర్ష చేసి చెప్పలేక పోతున్నాడు. కవయోప్యత్ర మోహితాః ఎంతో మేధావంతులైన మానవులకు కూడా అంతుపట్టక బుర్ర చెడగొట్టుకొంటున్నారు. ఏదో తెలిసినట్టు చెబుతుంటారేగాని వారు చెప్పేదేమిటో వారికే స్పష్టంగా తెలియదు.

  అంచేత మాటగాదు మనకు కావలసింది. మాట ఏమి చెబుతుందో ఆ భావం. అది మహాపండితుల మని విర్రవీగే వారికే తెలియదు కాబట్టి నీబోటి వాడికి తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు. అసలు ఎప్పటికీ తెలియకపోతే ఆ జీవితానికి ప్రయోజనం లేదు. తెలియక పశుప్రాయంగా జీవించి ఏమి సుఖం. పురుషార్ధానికే నోచుకోలేవు. కనుక తత్తే కర్మ ప్రవక్ష్యామి. కర్మ అంటే అసలేమిటో నీకు నిష్కర్ష చేసి చెబుతాను విను.

  కర్మ అనే దాని స్వరూపమిద మితమని నీవు నిశ్చయంగా తెలుసు కొంటే గాని ఆ మార్గంలో నీవు ప్రయాణం చేయలేవు. ప్రయాణిస్తే గాని ఎప్పటికైనా జీవిత గమ్యం చేరలేవు. యదజ్ఞాత్వా - దాని విషయమంతా ఆకళించుకొని తదనుగుణంగా నడచుకొన్నప్పుడే మోక్ష్యసే అశుభాత్ అమంగళమైన ఈ సంసార సాగరంలోనుంచి అవలీలగా నీవు బయట పడగల వర్ణునా అని హెచ్చరిస్తున్నాడు భగవానుడు. ఇది మనందరికీ చేసే హెచ్చరికే.

కర్మణో హ్యపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ వికర్మణః |
అకర్మణశ్చ బోద్ధవ్యం గహనా కర్మణో గతిః || 17 ||

Page 316

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు