జ్ఞాన యోగము
భగవద్గీత
లేదనకుండా ఆచరిస్తూ వచ్చిన వారే. ఎవరూ కర్మ మానేయ గూడదు. యద్యనాత్మజ్ఞః త్వం తదా ఆత్మశుద్ధ్యర్థమ్. నీకింకా ఆత్మజ్ఞాన ముదయించక పోతే చిత్తశుద్ధి కోసమైనా చేయాలి కర్మ. తత్త్వవిచ్చేత్ లోక సంగ్రహార్ధమ్. జ్ఞానివైతే లోకోద్ధరణ కోసమైనా చేసి తీరాలి. జ్ఞానానికీ కర్మే. జ్ఞానంలోనూ కర్మే. రెండువైపులా కర్మ అనే పదును పెట్టిన జ్ఞానమనే ఖడ్గమిది.
అందుకేనీకు చెబుతున్నా నర్జునా. కురు కర్మైవ తస్మాత్త్వం. నీవూ కర్మే చేసి తీరాలి. పూర్వైః పూర్వతరం కృతమ్. నీ మొహాన్నే పొద్దుపొడవ లేదు. అనాది నుంచీ మనపూర్వులూ వారికన్నా పూర్వులూ ఇలాగే చేస్తూ వచ్చారు. నీవూ వారి మార్గంలోనే నడుస్తున్నావు గాని క్రొత్తగా ఏమీ సృష్టించటం లేదు. సాధించటం లేదు. సాధిస్తానను కొన్న జ్ఞానం కూడా అంతకు ముందున్నదే. ఉన్నదే మరచి పోయి మరలా గుర్తు చేసుకొంటున్నావు. అందుకోసం సత్త్వాన్ని శుద్ధి చేసుకొనే ప్రయత్నం కర్మయోగమైతే గుర్తు రావటం జ్ఞానయోగమైతే దాని బలంతో మరలా కర్మ చేయటం విజ్ఞాన యోగం. అంత మాత్రమే.
కిం కర్మ కిమకర్మేతి- కవయో ప్యత్ర మోహితాః
తత్తే కర్మ ప్రవక్ష్యామి యద్ జ్ఞాత్వా మోక్ష్యసే - శుభాత్ -16
అసలు కర్మా కర్మా అని వాపాటకంగా మాటాడుతుంటాడు ప్రతి ఒక్కడూ. కర్మ అంటే ఏమిటో తెలిసే మాట్లాడుతున్నాడా అని నాకను మానం. ఎందుకంటే కింకర్మ - కిమ కర్మేతి - ఏది కర్మ ఏది కర్మకాదని
Page 315