జ్ఞాన యోగము
భగవద్గీత
చేసుకోవాలి. చేసుకొంటే సృష్టి వర్ణన చేసినా సృష్టి విషయంలో లేదు తాత్పర్యం. జీవేశ్వరైక్యంలో. అందుకే సృష్టి వర్ణన భంగ్యంతరంగా తోడుపడుతున్నది.
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః |
కురు కర్మైవ తస్మాత్ త్వం పూర్వైః పూర్వతరం కృతమ్ || 15 ||
ఏతావతా తేలిన సారాంశమేమంటే సృష్టిని గూర్చిగాదు నీవు ఆలోచించ వలసింది. మిధ్యాభూతమైన సృష్టి దేనికి నీకు. దీనికధిష్ఠానమైన పరమార్ధమేదో దాన్ని అన్వేషించి పట్టుకోవాలి. అది ఆత్మస్వరూపమే. వస్తు సిద్ధంగా సర్వత్రా సర్వదా ఉన్నదదే. దాన్ని గ్రహించుటయే జ్ఞానయోగం. అందుకోసం ప్రయత్నించటమే కర్మయోగం. నేను దేనికీ కర్తసు గాను భోక్తను గానని దృఢంగా నమ్మి ఆభావంతో కర్మలు ఆచరించటమే కర్మయోగం. ఏవం జ్ఞాత్వా. ఈ విధంగా తెలుసుకొని అంటున్నది గీత. ఏవిధంగా తెలుసుకోవాలి. కర్తనూ భోక్తనూ గానని జ్ఞానానికి ముందూ తెలుసుకోవాలి. జ్ఞానోదయమైన తరువాతా తెలుసుకోవాలి. ముందు తెలుసుకొని చేయటం జ్ఞానం కోసమైతే తరువాత తెలుసుకోటం జ్ఞాన నిష్ఠ కోసం. అటూ ఇటూ ఉంది కర్మ. అటు ప్రయత్న రూపంగా ఇటు ప్రవర్తన రూపంగా.
కృతం కర్మ పూర్వైరపి ముముక్షుభిః మోక్షం కావాలని కోరేవాడు ముముక్షువు. అలాంటి ముముక్షువు లంతా మొదటి నుంచీ ఇలా కర్మ
Page 314