జ్ఞాన యోగము
భగవద్గీత
కర్మ అయినా - ఇతిమాం యోభిజానాతి అని ఈ విధంగా ఎవడు నన్ను గుర్తిస్తాడో అర్ధం చేసుకొంటాడో. కర్మ భి ర స బధ్యతే అలాంటివాడినే కర్మా బంధించదు. కర్మఎలా బంధిస్తుందస లెవడినైనా. నేనీ కర్మ చేస్తున్నాననే కర్తృత్వంతో ఫలానా ఫలితం కోసమనే భోక్తృత్వంతో ఈ రెండింటితోనే బంధిస్తుంది. కర్తనూ కాను భోక్తనూ కాననే సాక్షి భావంతో చూస్తే ఎలా బంధ మవుతుందది. చూస్తే అంటే ఎవరిని చూస్తే చూచి అంటున్నాడు పరమాత్మ. నన్ను అంటున్నాడు. అంటే పరమాత్మ నలా చూడాలనా లేక నన్ను అని ఎవడి ఆత్మను వాడలా చూడాలనా. ఏదైనా ఒకటే. పరమాత్మ నలా చూడటమంటే తన్ను తానలా చూడటమే. పరమాత్మ అంటే పరిపూర్ణ చైతన్యమే గదా. దాన్ని చూస్తున్నప్పుడీ జీవచైతన్యం కూడా పరిపూర్ణ దృష్టితోనే గదా చూడవలసింది. రెండూ అలా పరిపూర్ణమైతే ఇక రెండెలా కాగలవవి. ఒకే ఒక చైతన్యం. అఖండ చైతన్యం. నదీ జలమూ జలమే. సముద్ర జలమూ జలమే. నదీ జలం సముద్ర జలాన్ని చూచిందన్నా మనుకోండి. ఏమిటి దాని అర్ధం. నది సముద్ర మయిందనే గదా. అలాగే యోభి జానాతి. ఎవడలా పరమాత్మను భావిస్తాడో ఆ భావనతోనే వాడు పరమాత్మ అయ్యాడని భావం. అప్పటికి పరమాత్మ భావన పెట్టుకొని చూడండి. అప్పుడిక మీకు సృష్టి చింతన లేదు. గుణకర్మ చింతన లేదు. పరిమితమైన జీవ చైతన్యాన్ని పరిపూర్ణమైన ఈశ్వర చైతన్యం వైపు మళ్లించాటానికే ఈ వర్ణన అంతా అని అర్ధం
Page 313