సత్యం. అద్వైతంలో ఎక్కడ పూర్వాపర విరోధమున్నట్టు కనిపించినా అది నిజమైన వైరుధ్యం కాదు. ఒకటి లోక దృష్టి ననుకరించి చెప్పేమాట. మరొకటి శాస్త్ర దృష్టితో దాన్ని కాదని త్రోసిపుచ్చుతూ చెప్పేమాట. రెండు మాటలూ ఒకరి మాటలు గావు. ఒకటి లోకం మాట. ఇంకొకటి శాస్త్రం మాట.
దీన్నిబట్టి ఇప్పుడు మనమర్ధం చేసుకోవలసిం దేమంటే అసలు సృష్టి జరిగినట్టు నీవూ నేనూ చూస్తుంటే అలా చూడకండి అది మీ సమస్యకు పరిష్కారం కాదు. మీకు తోచినట్టు ఊహిస్తుంటారే గాని అది యథార్ధం కాదు. యధార్ధమైనది పరమాత్మ చైతన్యమే. అది కర్తగాదు. భోక్త కాదు. కేవలం సాక్షిభూతమే. అదే నా స్వరూపమనే దృష్టితో పట్టుకొన్నారంటే మీరూ నాలాగే సాక్షిగా మారిపోతారు. అప్పుడీ ప్రపంచమూ లేదు మానవుడూ లేడు. వారి గుణకర్మలూ లేవు. అంతా వాసుదేవ స్సర్వమితి అన్నట్టు అనాత్మ అంతా ఆత్మ రూపంగానే మీకు అనుభవానికి రాగలదు. అదే ఈ సమస్యకు పరిష్కారమని చాటటమే ఇందులో దాగి ఉన్న పరమాత్మ ఆశయం.
అదే ఇప్పుడు బయటపెడుతున్నాడు. నమాం కర్మాణి లింపంతి. నమే కర్మఫలే స్పృహా. నాకే కర్మలూ లేవు. వాటితో అసలు నాకు సంబంధమే లేదు. అసలు నాకు కావలసిన ప్రయోజన మేదైనా ఉంటే గదా కర్మ చేయటం. కర్మఫలం మీదనే నాకు కాంక్షలే నప్పుడెలా చేయగలనే
Page 312