జ్ఞాన యోగము
భగవద్గీత
న మాం కర్మాణి లింపంతి న మే కర్మఫలే స్పృహా |
ఇతి మాం యోఽభిజానాతి కర్మభిర్న స బధ్యతే || 14 ||
కాకపోయినా అసలెందుకు నీకీ కాకదంత పరీక్ష. నేను సృష్టించానని చెప్పినా సృష్టించలేదని చెప్పినా- అదీకాదు వారి వారి స్వభావమే సృష్టించిం దని చెప్పినా అంతా అబద్ధమే. వాస్తవం కాదు. కారణం సృష్టి అనేది ఏదైనా అది మాయా మయమే గదా. ఒక మాయావి ఎలా తన ఇంద్రజాల మహేంద్రజాలంతో ఒక గంధర్వ నగరాన్ని ఆకాశంలో కల్పిస్తాడో అలాంటి కల్పన ఈ సమస్త ప్రపంచమూ. ఉందంటే ఉందది లేదంటే లేదు. ప్రతీతి సిద్ధమే గాని Apparent అది వస్తు సిద్ధం Actual కాదు. ప్రపంచ సృష్టే అసత్య మైనప్పుడిక మానవసృష్టి మాత్రం అసత్యం గాక సత్యమెలా అవుతుంది. చేతన సృష్టీ కాదు అచే తన సృష్టి కాదు. ఏదీ సత్యం కాదు. అంతా అసత్కల్పమే.
మరి అసత్యమైనప్పు డెందు కింత చిలువలు పలువలు పెట్టి వర్ణించటం పరమాత్మ. బ్రాహ్మణాది వర్ణాలను నేనే సృష్టించానని - నేను గాదు వారి స్వభావం సృష్టించిందని ఎందుకిన్ని మాటలు. నిజమే. కాని ఒక లోతైన అంతరార్ధ ముంది ఇలా వర్ణించటంలో. అదేమిటంటే మనబోటి మానవుల దృష్టితో ఒకమాట చెప్పి తరువాత తన దృష్టితో మరొక మాట చెబుతున్నాడు పరమాత్మ. మరొక విధంగా చెబితే తాను సృష్టించానని చెప్పటం వ్యావహారిక సత్యమైతే సృష్టించలేదని చెప్పటం పారమార్ధిక
Page 311