#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  కాకపోయినా వర్ణాలనేవి బ్రహ్మ క్షత్రియ వైశ్యశూద్రులని భావించి ఏమిటందరూ మానవులే గదా. ఎందుకీ భేదభావమని నీ వాక్షేపించినా వర్గభేదాన్ని కాదన లేవు గదా. ఒకే మానవ జాతిలో కొందరు విద్యావంతు లుంటారు. వారు బ్రాహ్మణు లనుకో. తప్పు లేదు. ప్రజాపాలకులైన మంత్రులూ దేశాధ్యక్షులూ ఉంటారు. వారే క్షత్రియులని భావించు. మరి వాణిజ్యమూ పరిశ్రమలూ చేసి ఆర్థికాభివృద్ధికి తోడ్పడే వర్గమొకటి ఉంటుంది. వారే వైశ్యులను కోండి. అలాగే కాయకష్టం చేసి యంత్రాగారాలలో పరిశ్రమ చేసి-సేద్యం వడ్రంగం – మొదలైన పనులు చేసే పనివాళ్లుంటారు. వారే శూద్రులని భావిస్తే చాలు. ఏ గొడవాలేదు. అందరూ ఒకే పని చేయలేరు. ఎవరి పనివారు చేస్తేనే దేశాభ్యుదయం సిద్దిస్తుంది.If not caste system class system prevails in soci ety. ఒకటి Learned class విద్యావంతులు. ఒకటి Ruling class వారే క్షత్రియులు. మరొకటి Business men or Industrialists వారే . వైశ్యులు. ఇంకొకరు Labourers or working community వారే శూద్రులను కొంటే పేచీ లేదు గదా. నామ్ని కో దోషః అన్నారు భగవత్పాదులు. పేరులో ఏముంది. కాబట్టి వర్ణ విభాగమను. వర్గ విభాగమను. అది గాదు పరమార్ధం. పరమార్థ మవి భక్తమైన సత్యం. దాన్ని అందుకొనే మార్గం విభాగం. విభాగం ద్వారానే అవిభాగమైన గమ్యాన్ని అందుకోవాలి. From Diversity to unity ఇదే గొప్ప సూత్రం. భగవానుడి మాటల్లో ధ్వనించే బ్రహ్మాండమైన సందేశమిది.

Page 310

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు