జ్ఞాన యోగము
భగవద్గీత
దానిలో కర్మను చూడటమేమిటి. పైగా ఇదే అర్ధం లేని ప్రసంగ మనిపిస్తుంటే ఇంతకన్నా అర్ధం లేని దలా చూచేవాడే జ్ఞాని వాడే మహాయోగి వాడే సకల కర్మానుష్ఠాన దక్షుడని గొప్ప చేసి వర్ణించటం.
కాబట్టి అక్కడ ఉన్నదున్నట్టు బాహ్యార్ధం చెప్పుకొంటే సరిపోయే వ్యవహారం కాదిది. యా నిశా సర్వభూతానా మనే శ్లోకానికెలా వ్యాఖ్యానం చేశామో అలాగే దీని అంతరార్థమేదో దాన్ని వ్యాఖ్యానించి చెప్పుకోవలసి ఉంది. అప్పుడే శ్లోకభావం శ్రోతల మనసులో బాగా నాటుకొంటుంది. కర్మ వికర్మ అకర్మ అని మొదట మూడు శాఖలుగా విభజించి చెప్పాడు పరమాత్మ. పోతే ఇప్పుడా మూడింటిలో వికర్మ అనేది తప్పించి రెండే బయట పెడుతున్నాడు. ఒకటి కర్మ. మరొకటి అకర్మ. చేసేది కర్మ చేయక మానేసేది అకర్మ. ఒకదానిలో ఒకటి చూడటమంటే ఏమిటర్ధం. ఒకదానిలో గాదు. ఒకదాన్ని మరొక దాన్ని గానని అర్ధం చేసుకోవాలి మనం. అంటే ఏమన్న మాట. కర్మ నకర్మగా అకర్మను కర్మగా. కర్మ జరుగుతుంటే ఏమీ జరగటం లేదనీ - ఏ కర్మా జరగకున్నా అక్కడ ఒక కర్మ జరుగుతూనే ఉందనీ దర్శించాలట.
ఒక ప్రశ్న. జరుగుతుంటే జరగలేదని ఎలా అనుకోవాలి. జరగ కున్నా జరుగుతున్నదని ఎలా భావించాలి. దీనిమీద ఎంతో దీర్ఘమైన విచారణ సాగించారు భగవత్పాదులు. కాని అది చాలా సాంప్రదాయికమైన సాంకేతికమైన విచారణ. నలుగురికీ అంతుపట్టే వ్యవహారం కాదు. అన్నీ
Page 319