జ్ఞాన యోగము
భగవద్గీత
కలియబోసుకొని దీని తాత్పర్యమేమిటో చెబుతాను వినండి. ఇక్కడ కర్మ అకర్మ అనేది శాస్త్రవిహితమైన కర్మ అని అలాంటి విహిత కర్మలు మానేసి కూచోటమని అర్ధం కాదు. మరేమిటంటే శాస్త్రీయమైన లౌకికమైన ఏ కర్మ అయినా కర్మే. అలాగే అందులో ఏ కర్మ చేయకున్నా అది అకర్మే. ఇదీ మొదట మనం గ్రహించవలసిన అంశం.
పోతే ఇక కర్మను కర్మ కా ద కర్మ అని - అకర్మను అకర్మ గాదు కర్మ అని చూడటం దగ్గర వస్తున్నది పేచీ. ఇది సమర్ధించటానికి భాష్యకారు లెంత ప్రయత్నించినా అది అంత తృప్తికరంగా లేదు నా మనస్సుకు. ఒకవిధంగా శంకరా నంద చేసిన వ్యాఖ్యలో కొంత ఆధారం దొరుకుతుంది మనకు. అదేమిటంటే కర్మ కర్మే. పోతే అకర్మ అంటే కర్మ కానిదేదో అది జ్ఞానమని అర్ధం. అప్పటికి కర్మ నకర్మగా చూడటమంటే కర్మను జ్ఞానంగా చూడటం. కర్మ ఏదోగాదు జ్ఞానమే నని భావించాలి. అలాగే అకర్మను కర్మగా చూడటమంటే జ్ఞానాన్ని కర్మగా భావించటం. జ్ఞానమే ప్రసరిస్తే అది కర్మ అనీ - కర్మ ప్రసరించకుంటే అది జ్ఞానమనీ అర్ధం చేసుకోవాలి సాధకుడు.
అప్పటికి జ్ఞానానికీ కర్మకూ తేడా లేదు. జ్ఞానం స్వరూపమైతే కర్మ దాని విభూతి. కర్మ విభూతి అయితే జ్ఞానం దాని స్వరూపం. రెంటికీ విరోధ మేముంది. జ్ఞానం నిశ్చలమైన సముద్ర మనుకొంటే కర్మ చలిస్తూ ఒడ్డు దాకా వచ్చే తరంగమని భావిస్తే సరిపోలేదా. అచలమైనా చలమైనా
Page 320