#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

  రెండూ జలమే గదా. అచలమే చలించి తరంగ మయింది. చలమైన తరంగమే అచలమై మరలా సముద్ర మని పిస్తున్నది. అలాగే నీవు మనసుతో ఏది ఆలోచిస్తున్నా నోటితో ఏది మాటాడుతున్నా శరీరంతో ఏది చేస్తున్నా ఆ కర్మలన్నీ అచలమైన జ్ఞానమే అలా చలించి బయట పడుతున్నదని ఈ చలనాలన్నీ మరలా ఎక్కడి నుంచి వస్తున్నాయి వీటి స్వరూపమేమిటా అని చూస్తే అవన్నీ జ్ఞానమాడే నాటకమేనని భావిస్తే అంతా నీ ఆత్మ చైతన్యమే. అంతకన్నా క్రొత్తగా ఏమున్న దక్కడ. తదేజతి తన్నైజతి - అది కదులుతుంది - కదలదు అని ఈశావాస్యం చెప్పిందంటే ఈ దృష్టితోనే చెప్పింది. కదల దన్నప్పు డది జ్ఞానం. కదులుతుంద న్నప్పుడది కర్మ. రెండూ రెండు వేర్వేరు పదార్ధాలు కావు. ఒకే పదార్ధం తాలూకు రెండు ముఖాలు phases రెండు దశలు Stages. దీనికే సంస్థాపమని Constitution or formation అని పేరు పెట్టారు భగవత్పాదులు. యధాసర్పః కుండలీ భవతి అన్నారాయన. ఒక సర్పం కుండలాకారంగా కనిపిస్తుందొకప్పుడు. అదే దండాకారంగా ప్రాకిపోతుం దొకప్పుడు. రెండూ దాని భంగిమలేగాని ఆ ప్రాణి మాత్రమొక్కటే. ఒకదాని కొకటి విరుద్ధం కాదు. స్వరూపంలో రెండూ సమన్వయ మవుతాయి.

  అలాగే ఆత్మ పదార్థం తాలూకు రెండు భంగిమ లివి. ఒకటి జ్ఞానం మరొకటి కర్మ. బొమ్మా బొరుసులాగా ఒకే ఒక ఆత్మ తత్త్వమనే

Page 321

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు