అతడు మనమనుకొన్న మొదటి శ్రేణికి చెందినవాడు కాడు. రెండవ దానికి చెందినవాడే. అతడనే కాదు. మనబోటి అర్జునుల దృష్టి కూడా ఇలాంటిదే. అదేమిటో అతడడిగే ప్రశ్నలోనే ఇప్పుడు బయట పడుతున్నది ఏమిటా ప్రశ్న. అపరం భవతో జన్మ. బావగారూ మీ జన్మ చూద్దామా - ఇటీవలి కాలంలో దేవకీ వసుదేవులకు బందిఖానాలో జన్మించిన వారు మీరు. మరి మీరు సూర్య భగవానుడికి బోధించానని పేర్కొన్నారే ఆ సూర్యుడెప్పటి వాడు. పరం జన్మ వివస్వతః - మీకంటే నాకంటే ఎంతో కాలం ముందే పుట్టి అప్పటినుంచీ లోకాన్ని వెలిగిస్తూ ఉన్నవాడు. మీది అపరమైతే అతనిది పరం. ఇప్పటి జన్మమీది అప్పటి జన్మ ఆయనది.
కధమేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్త వానితి - మరి ఇది ఎలా నేనర్ధం చేసుకోవా లంటారు. ఇటీవల జన్మించిన మీరు మీకంటే పూర్వ మెప్పుడో జన్మించిన వివస్వంతుడికి జ్ఞానోపదేశం చేశానని చెప్పట మది ఎలా సాధ్యం. పైగా అది మరలా గుర్తుచేసుకొని నాకు బోధిస్తున్నా నంటారేమిటి. నాలాగే మీరూ జన్మించారు గదా. అనాది కాలం నుంచీ బోధ చేస్తూ వచ్చాననే మాట కర్ధమేమిటి అని ప్రశ్నిస్తున్నా డర్జునుడు.
అర్జునుడిలా అడిగాడంటేనే అతనికి కృష్ణుడి మీద ఎలాటి అభిప్రాయముందో మన మిట్టే గ్రహించవచ్చు. కృష్ణుడంటే అతని దృష్టి కొక మానవుడు. మహా అయితే మానవులలోనే ఒక గొప్ప తెలివి తేటలున్న వ్యక్తి. అంతమాత్రమే గాని మానవోపాధిలో తిరుగుతూ చేస్తూ ఉన్న
Page 284