ఏమిటీ గారడీ అనిపిస్తుంది పైకి చూస్తే పాఠకులందరికీ. కాని నేను ముందే చెప్పాను. కర్మజ్ఞానాలని పేరేగాని రెంటికీ మన మను కొన్నంత తేడా లేదని. తేడా లేదనే సత్యం మనకు సూచించటానికే మహర్షి రెండింటికీ సాంఖ్యంలోనే ప్రవేశం కల్పించాడు. అది మరలా వేరు చేసి చూపుతూనే సన్న్యాస యోగంలో కర్మ నమాంతంగా జ్ఞానంలో కలిపి చూపబోతున్నాడు. ఇంతకూ వ్యాసహృదయ మేమిటో మనమర్దం చేసుకోవాలి. అది వేద హృదయమే. వేరుగాదు. వేదం మొదట మొదట ప్రవృత్తి రూపంగా నడచినా చివరకు నివృత్తి ధర్మంలో అంతమయి పోతున్నది. కనుకనే ఉపనిషత్తులకు వేదాంతమని పేరు వచ్చింది. అది జ్ఞానమే. కర్మ జ్ఞానంతో సమాప్త మవుతుందని వేద తాత్పర్యం అదే గీతా తాత్పర్యం కూడా.
ఇంతకూ జ్ఞానం స్వరూపం కర్మ దాని విభూతి. దృష్టి జ్ఞానం సృష్టి కర్మ. జ్ఞానం విస్తరిస్తే కర్మ. కర్మ ఆగిపోతే జ్ఞానం. కదలకుండా షెడ్డులో ఉన్న కారు జ్ఞాన మనుకొంటే షెడ్డు విడిచి కదలిపోయే కారు కర్మ. రెండు వస్తువులు లేవక్కడ. ఉన్న వస్తు వొక్కటే. దాని భంగిమలు Phases రెండు. కాబట్టి కర్మ జ్ఞానాలు రెండూ నీవూ నేనూ భావిస్తున్నట్టు బద్ధశత్రువులు కావు. రెండూ ఏకమే ఒక విధంగా. ఒకటి ఉపాయమైతే Means మరొకటి ఉపేయం End. కర్మ జ్ఞానాని కుపాయం. కర్మయోగమనే శిక్షణ లేకుండా జ్ఞానాన్ని అందుకోలేము. జ్ఞానాన్ని అందుకొన్నామంటే కర్మ జ్ఞానంగా మారిందని అర్ధం. ఆ మాటకు వస్తే
Page 276