#


Index



జ్ఞాన యోగము భగవద్గీత

జ్ఞానానికి ముందే గాదు తరువాత కూడా కర్మ తప్పదు. ముందు ప్రయత్న రూపమైతే అది తరువాత జ్ఞానికది ప్రవర్తన రూపం. వాడి జీవితమే అవుతుందది. వాడి చూపులో జ్ఞానం చేతలో కర్మ. ఎంత జ్ఞాని అయినా చేయకుండా ఉండలేడు గదా కర్మ. జీవితాంతమూ చేయవలసిందే. అయితే జ్ఞానమనే వెలుగులో చేస్తుంటాడు కాబట్టి ఆ వెలుగు ప్రసరించి అది కూడా వెలుగుగా మారిపోతుంది. ఇదే కర్మణ్య కర్మ - అకర్మణిచ కర్మ. తరువాత రాబోతుంది శ్లోకం.

  ఇలాంటి అవినాభావ సంబంధ ముండటం మూలాన్నే గీతాచార్యుడు వాటి రెండింటినీ ఒకటిగా భావించి ఒకే యోగమని సెలవిస్తున్నాడు. మనకు. సాంఖ్యయోగంలోనే రెండింటి ప్రస్తావనా వచ్చింది కాబట్టి ఈ శాస్త్రం కూడా అక్కడికి పరిసమాప్త మయినట్టు భావించి వంశ కధనం చేస్తున్నా డిప్పుడు కృష్ణ భగవానుడు. వంశమంటే ఇది గురు శిష్య సంప్రదాయం. Tradition సంప్రదాయమంటే బ్రహ్మజ్ఞానాన్ని గురువు శిష్యుడికి అందజేయటం. అది పరంపరగా రావాలి. దీనికే ఆగమమని కూడా పేరు పెట్టారు. ఆగమమంటే రావటమనే గదా అర్ధం.

ఇమం వివస్వతే యోగం ప్రోక్తవానహమవ్యయమ్ |
వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవేఽబ్రవీత్ || 1 ||

ఏవం పరంపరాప్రాప్తమిమం రాజర్షయో విదుః |
స కాలేనేహ మహతా యోగో నష్టః పరంతప || 2 ||

Page 277

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు