#


Index



జ్ఞాన యోగము భగవద్గీత







4. జ్ఞాన యోగము

  మూడు యోగాలయి ఇప్పుడు నాలుగవ దానిలో ప్రవేశిస్తున్నాము. దీనిపేరు జ్ఞానయోగం. ఇంతకుముందు జరిగింది కర్మయోగ మైతే ఇది జ్ఞానయోగం. కర్మ జ్ఞానం - ఒకటి ప్రవృత్తి మరొకటి నివృత్తి. ఇవి రెండే వేద వాఙ్మయం మానవలోకాని కంతటికీ చేస్తున్న బోధ. వేదవ్యాసుడు కూడా దానినే అనుసరించి మనకు బోధిస్తున్నాడు. సాంఖ్యయోగంలో రెంటినీ కలిపి చెప్పాడు. మళ్లీ విడగొట్టి చూపుతున్నాడు. అందులో కర్మయోగంలో కర్మను వర్ణిస్తూ వచ్చాడు. ఇప్పుడు జ్ఞానయోగంలో అలాగే జ్ఞానాన్ని వర్ణించబోతున్నాడు. ఆ తరువాత మళ్లీ కర్మను జ్ఞానంలో కలిపేసి అంతా జ్ఞానంగానే చూపబోతాడు కర్మ సన్న్యాసమనే అయిదవ అధ్యాయంలో.

Page 275

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు