కర్మ యోగము
భగవద్గీత
కామాన్ని సమూలంగా నిర్మూలించ గలవు. నీకది తప్ప లోకంలో శత్రువు లెవరూ లేదు. ఏ శత్రువైనా కామరూపుడే. కామం ద్వారానే శత్రువవు తున్నాడు వాడు నీకు. కామం లేకుంటే ద్వేషం లేదు. కామక్రోధాలు రెండూ లేకుంటే శత్రువులే కానరారు. అంతశ్శత్రువులని పేరు వీటికి. వీటి ఆ భాసే బయట నీకు శత్రువర్గంగా భాసిస్తున్నది. అంచేత ఆత్మజ్ఞాన బలంతో దాన్ని మట్టుపెట్టు. అలా కాకుంటే దురాసదమ్. దాని దరి చేరలేవు నీవు. తేరి చూడలేవు. అంత భయంకర మది. ఒక్క ఆత్మ జ్ఞాన బలం తోనే అది బలహీనమై తేలిపోతుంది. అంతవరకూ అనాత్మ కామంగా కనిపించే కామ మప్పుడు తన వేషం మార్చుకొని ఆత్మ కామమనే వేషాంతరంలో నీకు దర్శన మిస్తుంది. విశ్వానికి అమిత్రుడు గాక విశ్వానికే మిత్రుడయి సాధకుడి మోక్షమార్గానికి దివ్యమైన ప్రకాశాన్ని అందిస్తుంది.
కర్మ యోగః సమాప్తః
Page 274