కర్మ యోగము
భగవద్గీత
దానికి కూడా సాక్షియైన మనయీ ఆత్మను మనం మొదట ఫలానా అని పట్టుకోవాలి. మొదట ఇంద్రియాలను గదా అదుపులో పెట్టుకోమని చెప్పింది గీత. ఇప్పుడేమిటి మొదట ఆత్మను గుర్తించమని సలహా ఇస్తున్నదని సందేహించవచ్చు. అది నియమ్య ఇది బుద్ధ్వా. ఇంద్రియాలను నిగ్రహించుకోమని మాత్రమే ఉందక్కడ. తెలుసుకోమని లేదు. తెలుసుకోకపోతే అరికట్ట లేము వాటిని. తెలుసుకోవలసిన దాత్మ తత్త్వాన్ని. ఆత్మతత్త్వాన్ని బుద్ధ్వా ముందు తెలుసుకొని తరువాత ఇంద్రియాలను నియమ్య నిరోధించాలని అర్ధం చేసుకోవాలని గీతా హృదయం.
ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోటమే మిగతా వాటిని అదుపులో పెట్టు కోటానికి సాధనం. ఆ కొమ్మ పట్టుకొని గాని ఈ కొమ్మ వదిలేయటానికి లేదు. ముందు వదిలేయటం కాదు. పట్టుకోటం. కాబట్టి బుద్ధేః పరం బుధ్వా సంస్తభ్యా త్మాన మాత్మనా ఊరక పట్టుకొన్నామంటే పట్టుకొన్నామని గాదు. సళ్లుగా పట్టుకొంటే మళ్లీ ప్రమాదం. కామమెంత గట్టిగా పట్టుకొన్నదో మనల నంత కన్నా గట్టిగా పట్టుకోవా లాత్మను మనం. ఎలాగని. ఆత్మనా ఆత్మానం. బాగా పదునెక్కి ఏకాగ్రమూ పరిశుద్ధమూ అయిన బుద్ధితో దాన్ని జారిపోకుండా పట్టుకోవాలి. అంటే ఇదే మన స్వరూప మింతకన్నా ఏదీ కాదని దృఢ నిశ్చయంతో ఉండాలి.
జహి శత్రుం మహాబాహో - కామరూపం దురాసదం. అలా ఉంటే చాలు. అదే మనం చేయవలసిన సాధన. ఆ బలంతో నీవా గర్భ శత్రువైన
Page 273