#


Index

కర్మ యోగము భగవద్గీత

పరమంటే ఇంతకన్నా ఉత్కృష్ట మైనవని అర్ధం. ఇంద్రియేభ్యః పరం మనః – అలాటి ఇంద్రియ వర్గం కన్నా ప్రకృష్టమైనది మనస్సు. ఎందుకంటే ఆలోచనాత్మకమది. మనసు ఆలోచిస్తేనే ఇంద్రియాలు పనిచేస్తాయి. కనుక అది వీటి కన్నా గొప్పది. మనసస్తు పరాబుద్ధిః - మనసుకన్నా గొప్పది మానవుడి బుద్ధి. అది నిశ్చయాత్మకమైన జ్ఞానం. దానివల్లనే మనోవృత్తు లేర్పడుతున్నాయి.

  పోతే యో బుద్ధేః పరతస్తు సః - ఈ బుద్ధి కన్నా అతీతమైన తత్త్వ మొకటి ఉన్నదని గుర్తించాలి మానవుడు. ఏమిటది. దేహం దగ్గరి నుంచి బుద్ధి వరకున్న ఈ కలాపాన్నీ ఇవి చేసే వ్యాపారాలనూ అన్నింటినీ గమనించి చూస్తున్న ద్రష్ట. వీటికి సాక్షి Witness అయిన జ్ఞానం. కేవల జ్ఞానమే అది. అది వృత్తిగాదు. వృత్తులకు ఆశ్రయమిచ్చేది గాదు. ఆ వృత్తులను కూడా గమనిస్తున్నది. ద్రష్టే దృశ్యం కాదది. దానికే ఆత్మ అని పేరు. అన్నిటికీ వెనకాల ఉండి వీటి వ్యవహారాన్ని చూస్తుంటుంది. కాబట్టి ప్రత్యగాత్మ The inner self అని కూడా అంటారు దాన్ని. అదే మన అసలైన స్వరూపం. ఇప్పుడు వర్ణించిన సామగ్రి అంతా స్వరూపం కాదు. స్వరూపమది అయితే దాని ఉపాధు Media లివన్నీ.

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మనా |
జహి శత్రుం మహాబాహో కామరూపం దురాసదమ్ || 43 ||

  పోతే ఇప్పుడింతకూ మనం చేయవలసిన కర్తవ్యమేమిటో బయట పెడుతున్నదీ శ్లోకం. ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా - బుద్ధికి కూడా అతీతమై

Page 272

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు