#


Index

కర్మ యోగము భగవద్గీత

లేదా అని సంకోచించినట్టే. జ్ఞానయజ్ఞానుష్ఠాన మార్గానికది అడ్డం. కాబట్టి దాన్ని బ్రతకనివ్వ గూడదు. ఈడ్చి పారేయ వలసిందే ఆత్మారామ పదవి నందుకోవాలంటే.

  ఏమి కారణం . అది మనకు చేసే మహోపద్రవ మలాంటిది. జ్ఞాన విజ్ఞాన నాశనం. మనకున్న సర్వధనాన్ని అది అపహరించాలని చూస్తున్నది. ఏమరి ఉన్నామంటే అంత పనీ చేస్తుంది. మనం బికారులమయి పోతాము. పురుషార్ధానికే నోచుకోలేము. ఏమిటా ధనం. జ్ఞానం విజ్ఞానం. శాస్త్ర జన్యమైనది జ్ఞానం దాని అనుభవం విజ్ఞానం అని వ్రాశారు స్వామివారు. అది మనస్సూ బుద్ధి బాగా పనిచేస్తుంటే గాని గడించలేమా ధనాన్ని మనం. ఇంద్రియాల ద్వారా గాని వాటి కా ద్రవ్యం రవాణా గాదు. తద్వారా పోగైన ఆ మొత్తాన్ని కాజేస్తున్నదీ కామం. అంచేత దాన్ని ఉపేక్షించ రాదు సాధకుడు. కూకటివేళ్లతో సహా పెళ్లగించి పారేయాలి.

ఇంద్రియాణి పరాణ్యాహురింద్రియేభ్యః పరం మనః |
మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధేః పరతస్తు సః || 42 ||

  అది ఎలా సాధించాలా కార్యమంటే సలహా ఇస్తున్నది గీత. ఇంద్రియేభ్యః పరే హ్యార్ధా అర్దే భ్యశ్చపరం మనః అని కఠోపనిషత్తు చెప్పిన వరుసలోనే వర్ణించి చెబుతున్నది. ఇంద్రియాణి పరాణ్యాహుః - స్థూలమైన బాహ్యమైన పరిచ్ఛిన్నమైన ఈ శరీరం కంటే సూక్ష్మమూ వ్యాపకమూ ఆభ్యంతరమూ అయినవి మన ఇంద్రియాలు. అంచేత అవి పర మన్నారు.

Page 271

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు