చేతులు ముడుచుకొని కూచోరాదు. తాను మరలా ప్రయత్నం కొద్దీ దాన్ని తల పైకెత్తే లోపలనే త్రుంచి పారేయాలి. లేకుంటే దశరథ మహారాజు గతి పడతాడు. దశరధుడు తెలివైన వాడే. బుద్ధిమంతుడే. కాని ఏమి ప్రయోజనం. దూరం నుంచి శబ్దం మాత్రం విన్నాడేగాని అది దేని తాలూకు శబ్దమో విమర్శించి చూడలేదు. అది ఏనుగు చేసిన శబ్దమేనని ఎందు కనుకోవాలి. ఏనుగేనని ఎవరు చెప్పారు. ప్రారబ్ధం చెప్పిందా మాట. కాని అది చెబితే మాత్రం తాను విమర్శించుకో నక్కర లేదా. ఏ మాత్రం విమర్శ చేసినా వెంటనే బాణం ప్రయోగించేవాడు కాదు. ఆ ముని కుమారుడు మరణించేవాడు కాదు. కాబట్టి ప్రారబ్దం ప్రేరణ చేసినా మంచి చెడ్డలు విమర్శించి చూచే ప్రయత్నం మానవుడి కర్తవ్యం. అలా విమర్శించుకొని చూస్తే ప్రారబ్ధానికి జవాబు చెప్పగలమని బోధిస్తున్న దిప్పుడీ శ్లోకం.
తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ |
పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞానవిజ్ఞాననాశనమ్ || 41 ||
త్వక్చక్షుః శ్రోత్రజి హ్వా ప్రాణాలనే అయిదూ పాయూపస్థలనే అయిదూ వాక్పాణి పాద ఈ పదింటికీ ఇంద్రియాలని పేరు. త్యమింద్రియా ణ్యాదౌ నియమ్య. ఈ ఇంద్రియాల నన్నింటినీ ముందుగా నీవదుపులో ఉంచుకోవాలి. అవి అదుపులో ఉంచుకొని పాప్మానం ప్రజహి హ్యేనమ్. అన్ని పాపకార్యాలకూ మూలమైన ఈ కామపిశాచిని చంపి పారేయి. దాన్ని ఏమాత్ర ముపేక్షించినా శ్రీరాముడు తాటకను చంపుదామా
Page 270