#


Index

కర్మ యోగము

మని ప్రశ్నిస్తున్నా డిప్పు డర్జునుడు. అనర్ధానికి మూలమేదో తెలిస్తే గాని దాన్ని నిర్మూలించే ఉపాయ మన్వేషించి పట్టుకోలేడు మానవుడు.

  అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అసలొక మానవుడు పాపకార్యాలు చేస్తున్నాడంటే ఎందుకు చేస్తున్నాడు. ఎవరు చేయిస్తే చేస్తున్నాడు. అనిచ్ఛన్నపి. ఒకొక్కప్పుడు వాడు చేయాలని కోరకుండా చేస్తుంటాడు. బలాదివ నియోజితః - ఇష్టం లేకుండానే అధర్మానికి మొగ్గు చూపుతున్నాడంటే ఏదో శక్తి వెనకాల జేరి వాణ్ణి ముందుకు బలవంతంగా తోస్తున్న దనిపిస్తుంది. ఏమిటా శక్తి. ఎందుకలా పురమాయిస్తున్న దని ప్రశ్న. ప్రతి ఒక్కరికీ మనలో కలిగే సందేహమే ఇది. ముందు వెనక లాలోచించకుండా మనమొక పని చేస్తుంటాము. ఆ సమయంలో బుద్ధి పని చేయదు మనకు. మనశక్తిని మించిన దుష్టశక్తేదో మన వెనకాల పనిచేస్తున్న దని తోస్తుంది. ఏమిటది.

కామ ఏష క్రోధ ఏష రజోగుణసముద్భవః |
మహాశనో మహాపాప్మా విద్ధ్యేనమిహ వైరిణమ్ || 37 ||



  జవాబిస్తున్నాడు పరమాత్మ. ఏదో గాదది. దుష్టశక్తి కామమే. క్రోధమే. కామోకార్షీ న్మన్యుర కార్షిత్తని వేదవాక్యం. కామం చేయిస్తున్నది క్రోధం చేయిస్తున్నది మానవుడి చేత ప్రతి పనీ. మరేదీ గాదు. ఇంతకూ కామమా క్రోధమా అని అడిగితే రెండుగావని ఒకటే నని ఏకవచనంలో చెబుతున్నది గీత. రెండుగా కనిపించినా రెండుగావవి. నిజంలో రెండూ కలిసి ఒక్కటే. కామమే. దానికేదైనా అడ్డు తగిలితే క్రోధంగా మారుతుంది. అనుకూలిస్తే కామం. ప్రతికూలిస్తే కోపం. రాగద్వేషాలే ఈ కామక్రోధాలు మరోభాషలో.

Page 264

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు