#


Index

కర్మ యోగము భగవద్గీత

  ఇంతకూ కామమను. క్రోధమను. ఇది రజోగుణం వల్ల ఏర్పడుతున్నది మానవులకు. రజోగుణం చలానాత్మకం. ఇది మానవుడికి ప్రత్యేకమైన గుణం. ఎప్పుడూ చలిస్తూనే ఉంటుంది మానవుడి బుద్ధి. రజోగుణం కామాన్ని ప్రేరణ చేస్తే అది పురుషుడి బుద్ధిని రెచ్చగొడుతుంది. దానితో అదీ ఇదీ కావాలని ప్రాపంచికమైన విషయాల మీదికి దాడి చేస్తుంది మనస్సు. అందులో తాను కోరింది కోరినట్టు లభిస్తే ఆనందం. లేకుంటే ఎక్కడ లేని కోపం. ఆందోళన. హడావుడి. చివరకు ఫలితం లేకపోగా కోపం మితిమీరి పోయి మనస్సును కుంగదీస్తుంది. స్తిమితత తప్పిస్తుంది.

  మహాశనో మహాపాప్మా. మహాశనమీ కామం. ఎంత ఆహుతి పెట్టినా కడుపునిండదు దానికి. అది ఒక పెద్ద రాక్షసి. ఇంకా కావాలి కావాలనే గాని చల్లారేది గాదా కామానలం. అనలమని మంచిపేరే పెట్టారు. అలమంటే చాలు ననే భావం. అలాంటి తృప్తి లేదు గనుక అనలమన్నారు. అగ్నిని. ఎన్ని కట్టెలు వేసినా ఇంకా మండుతూనే ఉంటుంది. అలాగే ఎన్ని కోరికలు తీరినా ఇంకా కావాలనే కోరుతుంటుంది మానవుడి బుద్ధి. తృప్తి అనేది ఎరగదు. మహాపాప్మా. తృప్తి ఎప్పుడు లేదో అప్పుడది ఎన్ని పాపాలకైనా ఒడిగడుతుంది.

  విధ్యేన మిహ వైరిణమ్. కనుక ఈ కామమే మానవుడికొక పెద్ద శత్రువు. గర్భ శత్రువు. మనతో పాటే పుట్టిందిది. యావజ్జీవమూ మనలను వెంటాడుతూనే ఉంటుంది. చివరకు మనతోపాటే అస్తమిస్తుంది. అస్తమిస్తుందని మాట సామెతే గాని నిజంగా అస్తమించదు. వృత్తిరూపంగా లేకపోయినా వాసనారూపంగా వెంటాడుతుంది. సూక్ష్మశరీరంలో

Page 265

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు