కర్మ యోగము
భగవద్గీత
మనతోపాటు లోకాంతరాలకు వస్తుంది. అక్కడి నుంచి జన్మాంతరాలకూ తరిమి కొడుతుంది. మరలా మన మీ కర్మభూమిలో జన్మిస్తే ఇక్కడ మళ్లీ వృత్తి రూపంగా ప్రత్యక్ష మవుతుంది. ఎంత శత్రుత్వాన్ని సాధిస్తున్నదో చూడండి మనమీద ఈకామ పిశాచి.
ధూమేనావ్రియతే వహ్నిర్యథాదర్శో మలేన చ |
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ || 38 ||
ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా |
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ || 39 ||
ఇది ఒక పొగలాంటిది కామం. పొగ అనేది నిప్పులో నుంచే వస్తుంది. నిప్పులో నుంచి వచ్చి నిప్పునే కప్పివేస్తుంది. ధూమేనా ప్రియతే వహ్నిః - పొగ తాను చల్లగా ఉండి కూడా వేడిగా ఉన్న నిప్పును కప్పుతున్న దంటే ఎంత ఆశ్చర్యం. యధా దర్శోమలే నచ. అలాగే ఒక ఆదర్శముంది అద్దం. అది సహజంగా పరిశుద్ధమే. కాని మలేన దుమ్ము ధూళి పడిందంటే దాని మీద నల్లగా బూజరగా మారిపోతుంది. యధోల్బేనా వృతో గర్భః అలాగే మాతృగర్భంలో ఉన్న శిశువు కనపడకుండా ఆవరిస్తుంది ఉల్బం. ఉల్బమన్నా జరాయువన్నా ఒకటే. గర్భసంచి అని అర్ధం. అది ఒక పొరలాంటిది. అది చుట్టూ చేరి శిశువును కప్పుతుంది. తధా తేనేద మావృతం. అలాగే కామమనే దట్టమైన పొర కప్పేసింది మన జ్ఞానాన్ని.
Page 266